ఏఁటికి వేగిరపడే విప్పుడే నీవు
(॥పల్లవి॥)
ఏఁటికి వేగిరపడే విప్పుడే నీవు
సూటిగా నిద్దరిదిక్కుఁ జూడగరాదా
(॥ఏటి॥)
వెలయఁగ నే వెనక విన్నవించేఁగాని నీకు
చెలరేఁగి యాపెమాట చెప్పనీరాదా
తలకొని మరి నీవు దగవు దిద్దేవుగాని
వెలుచుక సుద్దులెలా వినరాదా
(॥ఏటి॥)
సిగ్గరిదానను మరి సేవలెల్లాఁ జేసేఁగాని
యెగ్గులే సంగతులెల్లాఁ దెలుసుకొనేవుగాని
దిగ్గన సంగతులెల్లాఁ దేలుసుకొనేవుగాని
అగ్గమై మా కోరికె లడుగరాదా
(॥ఏటి॥)
కూడితి శ్రీవేంకటేశ గురుతయ్యేఁగాని నేను
ఆడ నాపెఁగూడి గోర నదుమరాదా
జాడతో మాలో మమ్ము సంతము సేసేవుగాని
పాడిపంతా లొండొరులఁ బచారించరాదా
(||pallavi||)
em̐ṭigi vegirabaḍe vippuḍe nīvu
sūḍigā niddaridikkum̐ jūḍagarādā
(||eḍi||)
vĕlayam̐ga ne vĕnaga vinnaviṁchem̐gāni nīgu
sĕlarem̐gi yābĕmāḍa sĕppanīrādā
talagŏni mari nīvu dagavu diddevugāni
vĕlusuga suddulĕlā vinarādā
(||eḍi||)
siggaridānanu mari sevalĕllām̐ jesem̐gāni
yĕggule saṁgadulĕllām̐ dĕlusugŏnevugāni
diggana saṁgadulĕllām̐ delusugŏnevugāni
aggamai mā korigĕ laḍugarādā
(||eḍi||)
kūḍidi śhrīveṁkaḍeśha gurudayyem̐gāni nenu
āḍa nābĕm̐gūḍi gora nadumarādā
jāḍado mālo mammu saṁtamu sesevugāni
pāḍibaṁtā lŏṁḍŏrulam̐ basāriṁcharādā