ఏఁటికి వేగిరపడే విప్పుడే నీవ
(॥పల్లవి॥)
ఏఁటికి వేగిరపడే విప్పుడే నీవ
తేటతెల్లమైనప్పుడు తెలిసీఁ గాని
(॥ఏటి॥)
కొమరెపాయపుసతి కొలువులో నుండఁగాను
భ్రమసివున్నాఁ డతఁడు పలికీ నటే
సముకాన నాపె వచ్చి చవులు వుట్టించఁగాను
తమకించివున్నవాఁడు తలఁచీనటే
(॥ఏటి॥)
చక్కఁదనముల యాపె సరసములాడఁగాను
చొక్కినాఁ డెదిరివారిఁ జూచీనటే
చెక్కునొక్కి మరియును చేఁతలెల్లాఁ జేయఁగాను
అక్కరతో నున్నవాఁడు ఆదరించీ నటవే
(॥ఏటి॥)
పొందులు చేసినయాపె పొత్తుకు వచ్చివుండఁగా
విందుచెప్పవచ్చితేను వినీనటవే
అందపు శ్రీవేంకటేశుఁ డంతలొనె నిన్నుఁగూడె
మందెమేళమైనవాఁడు మఱచీనటే
(||pallavi||)
em̐ṭigi vegirabaḍe vippuḍe nīva
teḍadĕllamainappuḍu tĕlisīm̐ gāni
(||eḍi||)
kŏmarĕbāyabusadi kŏluvulo nuṁḍam̐gānu
bhramasivunnām̐ ḍadam̐ḍu paligī naḍe
samugāna nābĕ vachchi savulu vuṭṭiṁcham̐gānu
tamagiṁchivunnavām̐ḍu talam̐sīnaḍe
(||eḍi||)
sakkam̐danamula yābĕ sarasamulāḍam̐gānu
sŏkkinām̐ ḍĕdirivārim̐ jūsīnaḍe
sĕkkunŏkki mariyunu sem̐talĕllām̐ jeyam̐gānu
akkarado nunnavām̐ḍu ādariṁchī naḍave
(||eḍi||)
pŏṁdulu sesinayābĕ pŏttugu vachchivuṁḍam̐gā
viṁdusĕppavachchidenu vinīnaḍave
aṁdabu śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalŏnĕ ninnum̐gūḍĕ
maṁdĕmeḽamainavām̐ḍu maṟasīnaḍe