Emtigi vedugonevu yippude yinneem delise

ఏఁటికి వేడుకొనేవు యిప్పుడే యిన్నీఁ దెలిసె
Language

(॥పల్లవి॥)
ఏఁటికి వేడుకొనేవు యిప్పుడే యిన్నీఁ దెలిసె
నేఁటి కేమి రావయ్యా నీవే యెరుఁగుదువు

(॥ఏఁటి॥)
కొనగోరిచెనకులు గురుతై మైనుండుఁ గాని
మనసులో నాటేది మాటలే కావా
పెనగొన్న తేనెలు పెదవిపై నుండుఁగాని
కనుఁగొంటే తరితీపు కాంక్షలెల్లాఁ దీర్చదా

(॥ఏఁటి॥)
చెంతల నవ్వేనవ్వు సెలవుల నుండుఁ గాని
చింతఁ దల వంపించేది సిగ్గేకాదా
మంతనపుటలుకలు మరఁగునఁ బెట్టుఁగాని
అంతరంగపుతమక మండకు రప్పించదా

(॥ఏఁటి॥)
విందులరతిభేదాలు వేరులైతే నాయఁ గాని
కందువలు గరఁచేది కాఁగిలేకాదా
అంది శ్రీవేంకటేశ్వర అలమేల్మంగపతివి
పొందిన నీనేస్తము భువి నన్నీడేర్చదా

(||pallavi||)
em̐ṭigi veḍugŏnevu yippuḍe yinnīm̐ dĕlisĕ
nem̐ṭi kemi rāvayyā nīve yĕrum̐guduvu

(||em̐ṭi||)
kŏnagorisĕnagulu gurudai mainuṁḍum̐ gāni
manasulo nāḍedi māḍale kāvā
pĕnagŏnna tenĕlu pĕdavibai nuṁḍum̐gāni
kanum̐gŏṁṭe taridību kāṁkṣhalĕllām̐ dīrsadā

(||em̐ṭi||)
sĕṁtala navvenavvu sĕlavula nuṁḍum̐ gāni
siṁtam̐ dala vaṁpiṁchedi siggegādā
maṁtanabuḍalugalu maram̐gunam̐ bĕṭṭum̐gāni
aṁtaraṁgabudamaga maṁḍagu rappiṁchadā

(||em̐ṭi||)
viṁdularadibhedālu verulaide nāyam̐ gāni
kaṁduvalu garam̐sedi kām̐gilegādā
aṁdi śhrīveṁkaḍeśhvara alamelmaṁgabadivi
pŏṁdina nīnestamu bhuvi nannīḍersadā