ఏఁటికి వాదుకు వచ్చే వింత నీవు
(॥పల్లవి॥)
ఏఁటికి వాదుకు వచ్చే వింత నీవు
నాటకపు టాన లేల నమ్మనా నేను
(॥ఏటికి॥)
చెంతలఁ జెప్పనమాఁట చెవి యొగ్గి వింటిఁ గాక
కాంతుఁడ నీచేఁత లెల్లాఁ గంటినా నేను
యింతలోనేఎ నీకుఁ గోప మేల వచ్చె నిందరిలో
నంత నిన్ను గురి సేసి అంటినా నేను
(॥ఏటికి॥)
చెక్కుల తమ్మచెదరు చేతఁ దుడిచితిఁ గాక
తక్కిన వెఱుఁగుదునా తప్పులు నేను
గక్కన నీ వేల తారుకాణలకుఁ బెట్టేవు
వొక్క టై నీవద్దఁ బాయ కుండితినా నేను
(॥ఏటికి॥)
మించి కాఁగిలించఁగా నీ మేను నిమిరితిఁ గాక
యెంచి నీ మైగురుతు సోదించేనా నేను
అంచల శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
యించు కంతయిన నలయించేనా నేను
(||pallavi||)
em̐ṭigi vādugu vachche viṁta nīvu
nāḍagabu ṭāna lela nammanā nenu
(||eḍigi||)
sĕṁtalam̐ jĕppanamām̐ṭa sĕvi yŏggi viṁṭim̐ gāga
kāṁtum̐ḍa nīsem̐ta lĕllām̐ gaṁṭinā nenu
yiṁtaloneĕ nīgum̐ goba mela vachchĕ niṁdarilo
naṁta ninnu guri sesi aṁṭinā nenu
(||eḍigi||)
sĕkkula tammasĕdaru sedam̐ duḍisidim̐ gāga
takkina vĕṟum̐gudunā tappulu nenu
gakkana nī vela tārugāṇalagum̐ bĕṭṭevu
vŏkka ṭai nīvaddam̐ bāya kuṁḍidinā nenu
(||eḍigi||)
miṁchi kām̐giliṁcham̐gā nī menu nimiridim̐ gāga
yĕṁchi nī maigurudu sodiṁchenā nenu
aṁchala śhrīvĕṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
yiṁchu kaṁtayina nalayiṁchenā nenu