Emtigi sigguvadevu imkaa neevu

ఏఁటికి సిగ్గువడేవు ఇంకా నీవు
Language

(॥పల్లవి॥)
ఏఁటికి సిగ్గువడేవు ఇంకా నీవు
గాఁటపు నీ మోహనము కడగురుతు లేదే

(॥ఏఁటి॥)
బలిమి నీజవ్వనమే పట్టఁగరాదుగాని
అల నీ చన్నులు వట్టే దదేమి దొడ్డే
చలపట్టి పంతములు సారె నాడరాదుగాని
మలసి నీ మర్మముల మాట లాడవచ్చునే

(॥ఏఁటి॥)
వల పింతంతని చెప్పవశముగాదుగాని
కొలఁదివట్టేనే నీయెక్కువ పిరుఁదు
విలువ వెట్టఁగరాదు వేయైనా నీవేడుకకు
తులఁదూఁచవచ్చు మనదొమ్మి సమరతులు

(॥ఏఁటి॥)
పెనఁగేటి నీగుట్టు భేదించరాదుగాని
చెనకి పోఁకముడి మచ్చికఁ దీసేనే
యెనసితి శ్రీ వేంకటేశుఁడ నయిన నాకు
చనవిచ్చితివి ఇన్ని సాదించవచ్చునే

(||pallavi||)
em̐ṭigi sigguvaḍevu iṁkā nīvu
gām̐ṭabu nī mohanamu kaḍagurudu lede

(||em̐ṭi||)
balimi nījavvaname paṭṭam̐garādugāni
ala nī sannulu vaṭṭe dademi dŏḍḍe
salabaṭṭi paṁtamulu sārĕ nāḍarādugāni
malasi nī marmamula māḍa lāḍavachchune

(||em̐ṭi||)
vala piṁtaṁtani sĕppavaśhamugādugāni
kŏlam̐divaṭṭene nīyĕkkuva pirum̐du
viluva vĕṭṭam̐garādu veyainā nīveḍugagu
tulam̐dūm̐savachchu manadŏmmi samaradulu

(||em̐ṭi||)
pĕnam̐geḍi nīguṭṭu bhediṁcharādugāni
sĕnagi pom̐kamuḍi machchigam̐ dīsene
yĕnasidi śhrī veṁkaḍeśhum̐ḍa nayina nāgu
sanavichchidivi inni sādiṁchavachchune