ఏఁటికి సిగ్గులువడే వింతలోనే నన్నుఁ జూచి
(॥పల్లవి॥)
ఏఁటికి సిగ్గులువడే వింతలోనే నన్నుఁ జూచి
చాటువ నా నీతనితో సరసము లాడవే
(॥ఏఁటి॥)
చనవుగలదానికి సాదించవచ్చును
ననుపుగలదానికి నవ్వవచ్చును
వినయపుదానికి వేవేలు నాడవచ్చు
చెనకి పతిముందర చేఁతలు నెరపవే
(॥ఏఁటి॥)
బలిమిగలదానికి పంతము నెరపవచ్చు
కొలువుదానికిఁ గడు గొసరవచ్చు
వలపుగలదానికి వాడిక మెరయవచ్చు
పలుమారు విభునికి బత్తిసేయవే
(॥ఏఁటి॥)
ఆసలగలదానికి ఆయము లంటఁగవచ్చు
వేసాలదానికి వేఁడుకోవచ్చు
యీసరి శ్రీవేంకటేశుఁ డేలినాఁడు నన్ను నేఁడు
సేసవెట్టి నీవు గొంత చెలిమిసేసుకోవే
(||pallavi||)
em̐ṭigi sigguluvaḍe viṁtalone nannum̐ jūsi
sāḍuva nā nīdanido sarasamu lāḍave
(||em̐ṭi||)
sanavugaladānigi sādiṁchavachchunu
nanubugaladānigi navvavachchunu
vinayabudānigi vevelu nāḍavachchu
sĕnagi padimuṁdara sem̐talu nĕrabave
(||em̐ṭi||)
balimigaladānigi paṁtamu nĕrabavachchu
kŏluvudānigim̐ gaḍu gŏsaravachchu
valabugaladānigi vāḍiga mĕrayavachchu
palumāru vibhunigi battiseyave
(||em̐ṭi||)
āsalagaladānigi āyamu laṁṭam̐gavachchu
vesāladānigi vem̐ḍugovachchu
yīsari śhrīveṁkaḍeśhum̐ ḍelinām̐ḍu nannu nem̐ḍu
sesavĕṭṭi nīvu gŏṁta sĕlimisesugove