Emtigi sigguluvade vimduvamkam dappemi

ఏఁటికి సిగ్గులువడే విందువంకఁ దప్పేమి
Language

(॥పల్లవి॥)
ఏఁటికి సిగ్గులువడే విందువంకఁ దప్పేమి
నాటకములన్నిటాను నావాఁడవే

(॥ఏఁటి॥)
నీవు నామొగము చూచి నిలుచుండితేఁ జాలు
చేవదేర రతిఁ జొక్కించిన వాఁడవే
కైవశమై నాకు నీవు కలిగివుండితేఁ జాలు
యీవలసినచన విచ్చినట్టి వాఁడవే

(॥ఏఁటి॥)
చేసన్నల నామేను చేతనంటితేఁ జాలు
వోసరించక మాయింట నున్నవాఁడవే
వేసరక నావునికి విచారించితేఁజాలు
పోసరించి నీవు నన్ను భోగించినవాఁడవే

(॥ఏఁటి॥)
పానుపుపై నీవు నన్నుఁ బాయకుండితేఁజాలు
నానా రీతుల నాకు నంటువాఁడవే
కోనేటిశ్రీవేంకటేశ కూడితివి నన్ను నిట్టె
యీనెలవులను బాసలిచ్చినట్టి వాఁడవే

(||pallavi||)
em̐ṭigi sigguluvaḍe viṁduvaṁkam̐ dappemi
nāḍagamulanniḍānu nāvām̐ḍave

(||em̐ṭi||)
nīvu nāmŏgamu sūsi nilusuṁḍidem̐ jālu
sevadera radim̐ jŏkkiṁchina vām̐ḍave
kaivaśhamai nāgu nīvu kaligivuṁḍidem̐ jālu
yīvalasinasana vichchinaṭṭi vām̐ḍave

(||em̐ṭi||)
sesannala nāmenu sedanaṁṭidem̐ jālu
vosariṁchaga māyiṁṭa nunnavām̐ḍave
vesaraga nāvunigi visāriṁchidem̐jālu
posariṁchi nīvu nannu bhogiṁchinavām̐ḍave

(||em̐ṭi||)
pānububai nīvu nannum̐ bāyaguṁḍidem̐jālu
nānā rīdula nāgu naṁṭuvām̐ḍave
koneḍiśhrīveṁkaḍeśha kūḍidivi nannu niṭṭĕ
yīnĕlavulanu bāsalichchinaṭṭi vām̐ḍave