ఏఁటికి సిగ్గులువడే వెదుటను నన్నుఁ గని
(॥పల్లవి॥)
ఏఁటికి సిగ్గులువడే వెదుటను నన్నుఁ గని
కూటము లిద్దరికీఁ గైకొలుపుదునా
(॥॥)
సముకాన నుండఁగాను సతిమోము చూచి చూచి
తమకించి లోలోనే తడఁబడేవు
చెమరించె జెక్కులెల్లా చిత్తడాయ పచ్చడము
తిమిరేవు ఇద్దరికిఁ దెరవేతునా
(॥॥)
ఎంతగా మాటలాడఁగ వీనులను విని విని
దొంతరయాసలచేతఁ దొక్కులాడేవు
చింత నిట్టూర్పులు రేఁగి జిగిమించెఁ బులకలు
బంతినే మీ ఇద్దరికి బాగా లొసఁగుదునా
(॥॥)
సారెసారె నవ్వఁగాను సవర నీమోవి సోఁకి
మేరమీరి వేడుకతో నోరూరేవు
యీరీతి శ్రీవేంకటేశ ఇంతలో నన్నేలితివి
చేరితి రిద్దరికిని నేసలందిఇత్తునా
(||pallavi||)
em̐ṭigi sigguluvaḍe vĕduḍanu nannum̐ gani
kūḍamu liddarigīm̐ gaigŏlubudunā
(||||)
samugāna nuṁḍam̐gānu sadimomu sūsi sūsi
tamagiṁchi lolone taḍam̐baḍevu
sĕmariṁchĕ jĕkkulĕllā sittaḍāya pachchaḍamu
timirevu iddarigim̐ dĕravedunā
(||||)
ĕṁtagā māḍalāḍam̐ga vīnulanu vini vini
dŏṁtarayāsalasedam̐ dŏkkulāḍevu
siṁta niṭṭūrbulu rem̐gi jigimiṁchĕm̐ bulagalu
baṁtine mī iddarigi bāgā lŏsam̐gudunā
(||||)
sārĕsārĕ navvam̐gānu savara nīmovi som̐ki
meramīri veḍugado norūrevu
yīrīdi śhrīveṁkaḍeśha iṁtalo nannelidivi
seridi riddarigini nesalaṁdiittunā