ఏఁటికి సిగ్గులు వడే వెవ్వరున్నా రీడను
(॥పల్లవి॥)
ఏఁటికి సిగ్గులు వడే వెవ్వరున్నా రీడను
పాటించి నీభాగ్యమాయఁ బైకొనవయ్యా
(॥ఏఁటి॥)
మొగమునఁ జిరునవ్వు మొలచె నింతికిని
తెగని వలపులనుఁ దీగెలు సాగె
చిగిరించి కోరికలఁజెలఁగి గుత్తులు గట్టె
జిగి జవ్వనవనానఁ జిత్తగించవయ్యా
(॥ఏఁటి॥)
ముంచినపులక లనుమొగ్గలెల్లా నిండుకొనె
మంచికాపు వట్టెను చెమటముత్యాల
దించరానిమోవిపంటి తీపు లనేఫలమందె
పొంచి జవ్వనవనాన భోగించవయ్యా
(॥ఏఁటి॥)
సమరతి వూర్పులచల్లగాలి విసరెను
కొమరె గుబ్బలమేలు కుప్పలాయను
అమరె శ్రీవేంకటేశ అలమేలుమంగగూడె
తమి జవ్వనవనానఁ దని వొందవయ్యా
(||pallavi||)
em̐ṭigi siggulu vaḍe vĕvvarunnā rīḍanu
pāḍiṁchi nībhāgyamāyam̐ baigŏnavayyā
(||em̐ṭi||)
mŏgamunam̐ jirunavvu mŏlasĕ niṁtigini
tĕgani valabulanum̐ dīgĕlu sāgĕ
sigiriṁchi korigalam̐jĕlam̐gi guttulu gaṭṭĕ
jigi javvanavanānam̐ jittagiṁchavayyā
(||em̐ṭi||)
muṁchinabulaga lanumŏggalĕllā niṁḍugŏnĕ
maṁchigābu vaṭṭĕnu sĕmaḍamutyāla
diṁcharānimovibaṁṭi tību lanephalamaṁdĕ
pŏṁchi javvanavanāna bhogiṁchavayyā
(||em̐ṭi||)
samaradi vūrbulasallagāli visarĕnu
kŏmarĕ gubbalamelu kuppalāyanu
amarĕ śhrīveṁkaḍeśha alamelumaṁgagūḍĕ
tami javvanavanānam̐ dani vŏṁdavayyā