Emtigi siggubadevu yimdarilona

ఏఁటికి సిగ్గుపడేవు యిందరిలోన
Language

(॥పల్లవి॥)
ఏఁటికి సిగ్గుపడేవు యిందరిలోన
మాఁటు కరుగక ఇంక మాటలాడవమ్మా

(॥॥)
పొసఁగ నిన్ను నతఁడు పుత్తడబొమ్మవంటా
కొసరుచుఁ బొగడీని కొలువులోన
వసముచేసుకొని వలపించుకొంటివి
అసుదవుగావు వీడె మందుకొనవమ్మా

(॥॥)
సారెసారెకును నీవె చక్కనిదానవంటా
ఆరీతి నట్టె చూపీ నంగనలకు
మేరమీరి యిందరిలో మెప్పించుకొంటివి
కోరికతో సంగడిని కూచుండవమ్మా

(॥॥)
యీడైన యలమేల్మంగ విన్నిటా నేర్పరివంటా
వేడుకఁ గొసరీని శ్రీ వేంకటేశుఁడు
కూడితిరి మీరిద్దరు కొంకక మమ్మేలితిరి
వాడికలాయను మీవారము నేమమ్మా

(||pallavi||)
em̐ṭigi siggubaḍevu yiṁdarilona
mām̐ṭu karugaga iṁka māḍalāḍavammā

(||||)
pŏsam̐ga ninnu nadam̐ḍu puttaḍabŏmmavaṁṭā
kŏsarusum̐ bŏgaḍīni kŏluvulona
vasamusesugŏni valabiṁchugŏṁṭivi
asudavugāvu vīḍĕ maṁdugŏnavammā

(||||)
sārĕsārĕgunu nīvĕ sakkanidānavaṁṭā
ārīdi naṭṭĕ sūbī naṁganalagu
meramīri yiṁdarilo mĕppiṁchugŏṁṭivi
korigado saṁgaḍini kūsuṁḍavammā

(||||)
yīḍaina yalamelmaṁga vinniḍā nerbarivaṁṭā
veḍugam̐ gŏsarīni śhrī veṁkaḍeśhum̐ḍu
kūḍidiri mīriddaru kŏṁkaga mammelidiri
vāḍigalāyanu mīvāramu nemammā