ఏఁటికి శిరసువంచే వెదిరించి యాతనితో
(॥పల్లవి॥)
ఏఁటికి శిరసువంచే వెదిరించి యాతనితో
మాఁటలాడఁ గదవే మన్నించీ నతఁడు
(॥ఏటి॥)
కొనచూపులనుఁ జూచి కూరిమిగొరితేను
మనసు రంజిల్లును మగవానికి
వినయము లేసేసి వేమారుఁ దగిలితేను
ననిచి మిక్కిలి లోలో నంటు సమకూరును
(॥ఏటి॥)
వాడికవలపు చల్లి వద్దఁ గొలువు సేసితే
వేడుకలు వుట్టును విభునికీని
వీడెమందుకొని కొంత వెల్లవిరిగా నవ్వితే
చూడఁ జూడఁ బాయరాని చుట్టరిక మబ్బును
(॥ఏటి॥)
మచ్చికలే పచరించి మంతనానఁ బొదిగితే
యిచ్చక మవును శ్రీవేంకటేశ్వరునకు
వచ్చినట్టే వచ్చి కైవసమై మెలఁగితేను
మెచ్చు లిద్దరికి లోలో మిక్కుటమై నిండును
(||pallavi||)
em̐ṭigi śhirasuvaṁche vĕdiriṁchi yādanido
mām̐ṭalāḍam̐ gadave manniṁchī nadam̐ḍu
(||eḍi||)
kŏnasūbulanum̐ jūsi kūrimigŏridenu
manasu raṁjillunu magavānigi
vinayamu lesesi vemārum̐ dagilidenu
nanisi mikkili lolo naṁṭu samagūrunu
(||eḍi||)
vāḍigavalabu salli vaddam̐ gŏluvu seside
veḍugalu vuṭṭunu vibhunigīni
vīḍĕmaṁdugŏni kŏṁta vĕllavirigā navvide
sūḍam̐ jūḍam̐ bāyarāni suṭṭariga mabbunu
(||eḍi||)
machchigale pasariṁchi maṁtanānam̐ bŏdigide
yichchaga mavunu śhrīveṁkaḍeśhvarunagu
vachchinaṭṭe vachchi kaivasamai mĕlam̐gidenu
mĕchchu liddarigi lolo mikkuḍamai niṁḍunu