Emtigi satyaalu sese vemdaamkaa neevu

ఏఁటికి సత్యాలు సేసే వెందాఁకా నీవు
Language

(॥పల్లవి॥)
ఏఁటికి సత్యాలు సేసే వెందాఁకా నీవు
గాఁటముగ నింకాఁ దారుకాణించవలెనా

(॥॥)
చెలియిచ్చిన పువ్వులచెండు నీచేత నున్నది
మలసి నీచేఁత కది మచ్చము గాదా
కొలఁదిమీరఁగ తొల్లె గొల్లెతల మగఁడవు
యెలమి నీయెడ్డతనా లెంచిచూపవలెనా

(॥॥)
రమణిచే ముద్దుటుంగరము నీవేల నున్నది
కొమరై నీపొందు కది గురుతుగాదా
తమితోడ నీవు తొల్లె ధర్మరాజు మఱఁదివి
గములై నీ నిజాలకు కడగురు తున్నదా

(॥॥)
అంగనకంటసరి నేఁడట్టె మెడ నున్నది
సంగతిగా నీకదె లాంచనము గాదా
చెంగట నన్నేలితివి శ్రీ వేంకటేశ్వర
అంగపునీరతులకు నౌఁగాము లున్నవా

(||pallavi||)
em̐ṭigi satyālu sese vĕṁdām̐kā nīvu
gām̐ṭamuga niṁkām̐ dārugāṇiṁchavalĕnā

(||||)
sĕliyichchina puvvulasĕṁḍu nīseda nunnadi
malasi nīsem̐ta kadi machchamu gādā
kŏlam̐dimīram̐ga tŏllĕ gŏllĕdala magam̐ḍavu
yĕlami nīyĕḍḍadanā lĕṁchisūbavalĕnā

(||||)
ramaṇise mudduḍuṁgaramu nīvela nunnadi
kŏmarai nībŏṁdu kadi gurudugādā
tamidoḍa nīvu tŏllĕ dharmarāju maṟam̐divi
gamulai nī nijālagu kaḍaguru tunnadā

(||||)
aṁganagaṁṭasari nem̐ḍaṭṭĕ mĕḍa nunnadi
saṁgadigā nīgadĕ lāṁchanamu gādā
sĕṁgaḍa nannelidivi śhrī veṁkaḍeśhvara
aṁgabunīradulagu naum̐gāmu lunnavā