Emtigi nishtooramu imdugumgaa needonu

ఏఁటికి నిష్టూరము ఇందుకుఁగా నీతోను
Language

(॥పల్లవి॥)
ఏఁటికి నిష్టూరము ఇందుకుఁగా నీతోను
నాఁటుకొన సెలవుల నవ్వు నవ్వేఁ గాక

(॥॥)
యెదురాడేనా నీకు నేమేమి సేసినాను
కదిమి నీమాటల వంకలు దిద్దేమా
పదరి మరియేమైనాఁ బలుమారు సొలసేమా
సదరమనుచు నిన్ను సాదించేమా

(॥॥)
తిట్టు దిట్టేమా నిన్ను దిమ్మరివై తిరిగితే
యిట్టే నీమేని మచ్చాల కీడించేమా
గుట్టునీకు లేదనుచు గుణదోషా లెంచేమా
పట్టిరాఁగా నేము నీతోఁ బంతమాడేమా

(॥॥)
కాదు గూడదనేమా గబ్బితనాల నుండఁగ
వాదులడిచేమా నీవనితలతో
పోదిగా శ్రీవేంకటేశ పొందితివి నన్నునిట్టే
సాదుఁదనమే కాక జంకించేమా

(||pallavi||)
em̐ṭigi niṣhṭūramu iṁdugum̐gā nīdonu
nām̐ṭugŏna sĕlavula navvu navvem̐ gāga

(||||)
yĕdurāḍenā nīgu nememi sesinānu
kadimi nīmāḍala vaṁkalu diddemā
padari mariyemainām̐ balumāru sŏlasemā
sadaramanusu ninnu sādiṁchemā

(||||)
tiṭṭu diṭṭemā ninnu dimmarivai tirigide
yiṭṭe nīmeni machchāla kīḍiṁchemā
guṭṭunīgu ledanusu guṇadoṣhā lĕṁchemā
paṭṭirām̐gā nemu nīdom̐ baṁtamāḍemā

(||||)
kādu gūḍadanemā gabbidanāla nuṁḍam̐ga
vādulaḍisemā nīvanidalado
podigā śhrīveṁkaḍeśha pŏṁdidivi nannuniṭṭe
sādum̐daname kāga jaṁkiṁchemā