ఏఁటికి నిన్నుఁ గొసరే మింకా నేల
(॥పల్లవి॥)
ఏఁటికి నిన్నుఁ గొసరే మింకా నేల
ఆటల నీ యిచ్చ రాజవై బదుకవయ్యా
(॥ఏఁటికి॥)
కన్నులనే నిన్ను నవ్వి కాఁకల వలపు చల్లి
చన్నుల నొరసి యాపె చలి నాపెను
కన్నచోట్లఁ దెగినగాలిపడగవై నీవు
పన్ని మా దీవెన నిట్టె బదుకవయ్యా
(॥ఏఁటికి॥)
ముద్దుటుంగరము చూపి మోవిమీఁద మాటలాడి
బద్దులు ని న్నాపె నేరుపరిఁ జేసెను
వుద్దండాన నీ విఁక వూరువాడే చెలమవై
తిద్దుబడి నిట్టే ఆరితేరి బదుకవయ్యా
(॥ఏఁటికి॥)
కందువ మర్మములంటి కౌఁగిటనే చిమ్మి రేఁచి
సందడినే నిన్ను నాపె జట్టిగొనెను
యిందె కూడితి శ్రీ వేంకటేశ యలమేల్మంగను
కందువాసి నద్దమవై కని బదుకవయ్యా
(||pallavi||)
em̐ṭigi ninnum̐ gŏsare miṁkā nela
āḍala nī yichcha rājavai badugavayyā
(||em̐ṭigi||)
kannulane ninnu navvi kām̐kala valabu salli
sannula nŏrasi yābĕ sali nābĕnu
kannasoṭlam̐ dĕginagālibaḍagavai nīvu
panni mā dīvĕna niṭṭĕ badugavayyā
(||em̐ṭigi||)
mudduḍuṁgaramu sūbi movimīm̐da māḍalāḍi
baddulu ni nnābĕ nerubarim̐ jesĕnu
vuddaṁḍāna nī vim̐ka vūruvāḍe sĕlamavai
tiddubaḍi niṭṭe ārideri badugavayyā
(||em̐ṭigi||)
kaṁduva marmamulaṁṭi kaum̐giḍane simmi rem̐si
saṁdaḍine ninnu nābĕ jaṭṭigŏnĕnu
yiṁdĕ kūḍidi śhrī veṁkaḍeśha yalamelmaṁganu
kaṁduvāsi naddamavai kani badugavayyā