Emtigi nimta sesevu yiyyagovayya

ఏఁటికి నింత సేసేవు యియ్యకోవయ్య
Language

(॥పల్లవి॥)
ఏఁటికి నింత సేసేవు యియ్యకోవయ్య
చాటున నన్నియు మీఁదఁ జక్కనయ్యీఁ గాని

(॥ఏఁటి॥)
చిడుముడి నాపె నిన్నుఁజేయి వట్టి కొసరఁగ
పడఁతితోఁ బెనఁగేది పంతమా నీకు
తొడిఁబడ నిన్నా పె తొరల నాడినమాట
వడిగా నేఁడె నీకు వాఁడేయనా

(॥ఏఁటి॥)
కమ్మరఁ గమ్మర నాపె కన్నులనే నవ్వఁగాను
తమ్మిమోము వంచేది తగవా నీకు
మువ్మటికిని నాపె ముదులకించినమాట
చిమ్మిరేఁచి యింత నీకు చేఁదాయనా

(॥ఏఁటి॥)
గక్కన నాపె నిన్నుఁగాఁగిలించుకొనఁగాను
యిక్కువలు గరఁగితి వెన్నిక నీకు
తక్కక శ్రీవేంకటేశ తమిరేఁచినాపెమాట
చక్కనై నేఁడె నీకు చవులాయనా

(||pallavi||)
em̐ṭigi niṁta sesevu yiyyagovayya
sāḍuna nanniyu mīm̐dam̐ jakkanayyīm̐ gāni

(||em̐ṭi||)
siḍumuḍi nābĕ ninnum̐jeyi vaṭṭi kŏsaram̐ga
paḍam̐tidom̐ bĕnam̐gedi paṁtamā nīgu
tŏḍim̐baḍa ninnā pĕ tŏrala nāḍinamāḍa
vaḍigā nem̐ḍĕ nīgu vām̐ḍeyanā

(||em̐ṭi||)
kammaram̐ gammara nābĕ kannulane navvam̐gānu
tammimomu vaṁchedi tagavā nīgu
muvmaḍigini nābĕ mudulagiṁchinamāḍa
simmirem̐si yiṁta nīgu sem̐dāyanā

(||em̐ṭi||)
gakkana nābĕ ninnum̐gām̐giliṁchugŏnam̐gānu
yikkuvalu garam̐gidi vĕnniga nīgu
takkaga śhrīveṁkaḍeśha tamirem̐sinābĕmāḍa
sakkanai nem̐ḍĕ nīgu savulāyanā