Emtigi nemchevu mammu nidavarivalene

ఏఁటికి నెంచేవు మమ్ము నితవరివలెనే
Language

(॥పల్లవి॥)
ఏఁటికి నెంచేవు మమ్ము నితవరివలెనే
నాటకపు నీగుణము నానఁబోయీనా

(॥॥)
అగపడి కొలువులో నతివలెల్లా నుండఁగా-
నెగసక్కెమువలె నన్నేమి చూచేవు
మగఁడవైనా మెత్తని మనసు వాఁడవు నీవు
నగుబాటు నీవలపు నాటుకొనీనా

(॥॥)
కతలుచెప్పీన సతులు కాచుకుండఁగా నాతోనే
మతకమువలె నేమి మాటలాడేవు
పతివై నాఁ గాని యఁటుబచ్చలివంటివాఁ డవు
పతివై నీకొకవంక చవివుట్టీనా

(॥॥)
కొమరెలు వరుసకు కోరివేఁ వేఁడివుండఁ గాను
భ్రమసినట్టె నా కెంత బత్తిసేసేవు
రమణుఁడవైనా మీరవు శ్రీ వేంకటేశుఁడ
తమకపు నీరతులకు దారదప్పీనా

(||pallavi||)
em̐ṭigi nĕṁchevu mammu nidavarivalĕne
nāḍagabu nīguṇamu nānam̐boyīnā

(||||)
agabaḍi kŏluvulo nadivalĕllā nuṁḍam̐gā-
nĕgasakkĕmuvalĕ nannemi sūsevu
magam̐ḍavainā mĕttani manasu vām̐ḍavu nīvu
nagubāḍu nīvalabu nāḍugŏnīnā

(||||)
kadalusĕppīna sadulu kāsuguṁḍam̐gā nādone
madagamuvalĕ nemi māḍalāḍevu
padivai nām̐ gāni yam̐ṭubachchalivaṁṭivām̐ ḍavu
padivai nīgŏgavaṁka savivuṭṭīnā

(||||)
kŏmarĕlu varusagu korivem̐ vem̐ḍivuṁḍam̐ gānu
bhramasinaṭṭĕ nā kĕṁta battisesevu
ramaṇum̐ḍavainā mīravu śhrī veṁkaḍeśhum̐ḍa
tamagabu nīradulagu dāradappīnā