Emtigi neggulu vatte veebedo neevu

ఏఁటికి నెగ్గులు వట్టే వీపెతో నీవు
Language

(॥పల్లవి॥)
ఏఁటికి నెగ్గులు వట్టే వీపెతో నీవు
మాఁటలనే లాలించి మన్నింతువుగాక

(॥ఏఁటి॥)
ఇంతి నీతో మొగమోట మేమీ ననదాయఁగాక
రంతుల దిట్టఁ జెల్లదా రచ్చలో నిన్ను
చెంత నీ దేవి గనక సిగ్గువడి వుండెఁగాక
యెంత నిన్ను సాదించినా యేలనేవా నీవు

(॥ఏఁటి॥)
ఆలి మగని వరుస నట్టె వూరకుండెఁగాక
గేలిసేయ బాడి గాదా కెరలి నిన్ను
మేలుది గనక నిన్ను మీరలేక మొక్కెఁగాక
వాలాయించి జంకించితే వద్దనేవా నీవు

(॥ఏఁటి॥)
ఇచ్చక మెరిఁగి రతి నెనసి చొక్కించెఁగాక
కొచ్చి సోదించుకోవద్దా కొసరి నిన్ను
అచ్చపు శ్రీవేంకటేశ యలుమేలుమంగ యీకె
పచ్చిగా నిన్నుఁ జేసితే పంగించేవా నీవు

(||pallavi||)
em̐ṭigi nĕggulu vaṭṭe vībĕdo nīvu
mām̐ṭalane lāliṁchi manniṁtuvugāga

(||em̐ṭi||)
iṁti nīdo mŏgamoḍa memī nanadāyam̐gāga
raṁtula diṭṭam̐ jĕlladā rachchalo ninnu
sĕṁta nī devi ganaga sigguvaḍi vuṁḍĕm̐gāga
yĕṁta ninnu sādiṁchinā yelanevā nīvu

(||em̐ṭi||)
āli magani varusa naṭṭĕ vūraguṁḍĕm̐gāga
geliseya bāḍi gādā kĕrali ninnu
meludi ganaga ninnu mīralega mŏkkĕm̐gāga
vālāyiṁchi jaṁkiṁchide vaddanevā nīvu

(||em̐ṭi||)
ichchaga mĕrim̐gi radi nĕnasi sŏkkiṁchĕm̐gāga
kŏchchi sodiṁchugovaddā kŏsari ninnu
achchabu śhrīveṁkaḍeśha yalumelumaṁga yīgĕ
pachchigā ninnum̐ jeside paṁgiṁchevā nīvu