ఏఁటికి నీవే వచ్చేవు యెందుకైనాను
(॥పల్లవి॥)
ఏఁటికి నీవే వచ్చేవు యెందుకైనాను
పాటించి యాతఁడు నీకే బాస లిచ్చెనటవే
(॥ఏఁటి॥)
బత్తిగలదాననంటా పతికిఁ బూనుకవచ్చి
వుత్తరాలిచ్చేవు మాతో నొకటొకటె
హత్తి యాతఁడు నీవాఁడో అవ్వల నెవ్వతెవాఁడో
చిత్తములోపలఁ దెలిసితివటవే
(॥ఏఁటి॥)
చనవరిదాననంటా సవతులలోనెల్లా
పెనఁగే వాతనికిఁగా బింకము చూపి
కనెనో యిది యాతఁడు కడుఁబరాకై వున్నాఁడో
తనర నీసేవ యాతని కెక్కెనటవే
(॥ఏఁటి॥)
అండనుండేదాననంటా అట్టె శ్రీవేంకటేశుకై
దండిగా వేఁడుకొనే వందరిలో నన్ను
కొండవలె నన్ను నేలె కూటమి మనలో నెందో
అండుకాచి నీవతిని నడిగితివటవే
(||pallavi||)
em̐ṭigi nīve vachchevu yĕṁdugainānu
pāḍiṁchi yādam̐ḍu nīge bāsa lichchĕnaḍave
(||em̐ṭi||)
battigaladānanaṁṭā padigim̐ būnugavachchi
vuttarālichchevu mādo nŏgaḍŏgaḍĕ
hatti yādam̐ḍu nīvām̐ḍo avvala nĕvvadĕvām̐ḍo
sittamulobalam̐ dĕlisidivaḍave
(||em̐ṭi||)
sanavaridānanaṁṭā savadulalonĕllā
pĕnam̐ge vādanigim̐gā biṁkamu sūbi
kanĕno yidi yādam̐ḍu kaḍum̐barāgai vunnām̐ḍo
tanara nīseva yādani kĕkkĕnaḍave
(||em̐ṭi||)
aṁḍanuṁḍedānanaṁṭā aṭṭĕ śhrīveṁkaḍeśhugai
daṁḍigā vem̐ḍugŏne vaṁdarilo nannu
kŏṁḍavalĕ nannu nelĕ kūḍami manalo nĕṁdo
aṁḍugāsi nīvadini naḍigidivaḍave