Emtigi nee manigidaa limtesi neegu

ఏఁటికి నీ మనికితా లింతేసి నీకు
Language

(॥పల్లవి॥)
ఏఁటికి నీ మనికితా లింతేసి నీకు
జోటికి నీ వజ్రాంగి జోడవై వుండరాదా

(॥ఏఁటికి॥)
మాట లాడనేర దంటా మగువనుఁ బొగడేవు
నీటున నీవైనాఁ గొన్ని నేరుపరాదా
చాటువతో చిన్ననాఁడు చదువని కడమలు
నేటనే యాపెమారు నీవే చదువరాదా

(॥ఏఁటికి॥)
కడు ముద్దరాలు చెలి కన్నె యంటాఁ బొగడేవు
చిడిముడి నీవు ప్రౌఢఁ జేయఁగరాదా
పొడవుగా వారివారు బోధించేబోధలెల్లా
వడిగా నీ వవి యెల్ల వ్రాసుకొనరాదా

(॥ఏఁటికి॥)
కపటము నేరదంటా కౌఁగి లించే వాపెను
వుపమ లాపెకుఁ జెప్పి వొనరరాదా
యిపుడే శ్రీవేంకటేశ యిదె నన్నుఁ గూడితివి
రపమాయ నాపెనిందు రప్పించ రాదా

(||pallavi||)
em̐ṭigi nī manigidā liṁtesi nīgu
joḍigi nī vajrāṁgi joḍavai vuṁḍarādā

(||em̐ṭigi||)
māḍa lāḍanera daṁṭā maguvanum̐ bŏgaḍevu
nīḍuna nīvainām̐ gŏnni nerubarādā
sāḍuvado sinnanām̐ḍu saduvani kaḍamalu
neḍane yābĕmāru nīve saduvarādā

(||em̐ṭigi||)
kaḍu muddarālu sĕli kannĕ yaṁṭām̐ bŏgaḍevu
siḍimuḍi nīvu prauḍham̐ jeyam̐garādā
pŏḍavugā vārivāru bodhiṁchebodhalĕllā
vaḍigā nī vavi yĕlla vrāsugŏnarādā

(||em̐ṭigi||)
kabaḍamu neradaṁṭā kaum̐gi liṁche vābĕnu
vubama lābĕgum̐ jĕppi vŏnararādā
yibuḍe śhrīveṁkaḍeśha yidĕ nannum̐ gūḍidivi
rabamāya nābĕniṁdu rappiṁcha rādā