Emtigi nee kidaramaargamulu yela tavvedavu sittamaa

ఏఁటికి నీ కితరమార్గములు యేల తవ్వెదవు చిత్తమా
Language

(॥పల్లవి॥)
ఏఁటికి నీ కితరమార్గములు యేల తవ్వెదవు చిత్తమా
యీటునఁ బ్రయాసపడి నీ వంతకంటే మరి తెచ్చేవా

(॥ఏటికి॥)
నానావిధు లేటికీ మును నారదాదు లెఱిఁగిన తెరువు చాలదా
తూనుచఁ బొయ్యెదవు మతములు తొలుత శుకుఁడువోయినలోకంబులు చాలదా
మానక చదువులె వెదకెదవు మరి ప్రహ్లాదుఁడు కన్నగతి చాలదా
కానక కర్మములే చూచెదవు గజేంద్రుబడుకది చాలదా

(॥ఏటికి॥)
ఇంకానీ వెఱుఁగవా ఈతఁడు లక్ష్మీకాంతుఁడు యితనిఁగొలుచుట చాలదా
శంకలు యింకా నేటికి శరణాగతబిరు దితనిది యీతనిఁగొలుచుట చాలదా
పొంకపు సృష్టికి మూలపు బ్రహ్మను బొడ్డునఁ బుట్టించె నితఁడూ
అంకెల శ్రీవేంకటేశ్వరుఁ డీతఁడు అనాది వైకుంఠంబిఁది చాలదా

(||pallavi||)
em̐ṭigi nī kidaramārgamulu yela tavvĕdavu sittamā
yīḍunam̐ brayāsabaḍi nī vaṁtagaṁṭe mari tĕchchevā

(||eḍigi||)
nānāvidhu leḍigī munu nāradādu lĕṟim̐gina tĕruvu sāladā
tūnusam̐ bŏyyĕdavu madamulu tŏluda śhugum̐ḍuvoyinalogaṁbulu sāladā
mānaga saduvulĕ vĕdagĕdavu mari prahlādum̐ḍu kannagadi sāladā
kānaga karmamule sūsĕdavu gajeṁdrubaḍugadi sāladā

(||eḍigi||)
iṁkānī vĕṟum̐gavā īdam̐ḍu lakṣhmīgāṁtum̐ḍu yidanim̐gŏlusuḍa sāladā
śhaṁkalu yiṁkā neḍigi śharaṇāgadabiru didanidi yīdanim̐gŏlusuḍa sāladā
pŏṁkabu sṛṣhṭigi mūlabu brahmanu bŏḍḍunam̐ buṭṭiṁchĕ nidam̐ḍū
aṁkĕla śhrīveṁkaḍeśhvarum̐ ḍīdam̐ḍu anādi vaiguṁṭhaṁbim̐di sāladā