Emtigi navvulu navve videmoyi

ఏఁటికి నవ్వులు నవ్వే విదేమోయి
Language

(॥పల్లవి॥)
ఏఁటికి నవ్వులు నవ్వే విదేమోయి
దాఁటరానిమాట లాడీఁ దా నెవ్వరోయీ

(॥ఏఁటి॥)
అచ్చలాన నే నిట్టే యండ నిలుచుండఁగాను
హెచ్చి వెంగేలాడి నాపె యిదేమోయి
చెచ్చెర నేఁ బెండ్లాడినసేసపాలదాన నీకు
తచ్చనపంతాలు చూపీఁ దా నెవ్వరోయీ

(॥ఏఁటి॥)
చిట్టంటునీనెరులు నే చిక్కుదయ్యఁగానే నన్ను
యిట్టెవతప్పక చూచీ నిదేమోయి
పట్టపుదేవులనైనబలవంతురాల నేను
దట్టముగాఁ గాఁతాళించీ తా నెవ్వరోయీ

(॥ఏఁటి॥)
మంచముపై నేను నీ మన్ననలు సేకొనఁగాను
యించుకంత తొంగి చూచీ నిదేమోయి
ముంచి శ్రీవేంకటేశ మోహనఁ గూడినదాన
దంచీ వట్టిసణఁగు తా నెవ్వరోయీ

(||pallavi||)
em̐ṭigi navvulu navve videmoyi
dām̐ṭarānimāḍa lāḍīm̐ dā nĕvvaroyī

(||em̐ṭi||)
achchalāna ne niṭṭe yaṁḍa nilusuṁḍam̐gānu
hĕchchi vĕṁgelāḍi nābĕ yidemoyi
sĕchchĕra nem̐ bĕṁḍlāḍinasesabāladāna nīgu
tachchanabaṁtālu sūbīm̐ dā nĕvvaroyī

(||em̐ṭi||)
siṭṭaṁṭunīnĕrulu ne sikkudayyam̐gāne nannu
yiṭṭĕvadappaga sūsī nidemoyi
paṭṭabudevulanainabalavaṁturāla nenu
daṭṭamugām̐ gām̐tāḽiṁchī tā nĕvvaroyī

(||em̐ṭi||)
maṁchamubai nenu nī mannanalu segŏnam̐gānu
yiṁchugaṁta tŏṁgi sūsī nidemoyi
muṁchi śhrīveṁkaḍeśha mohanam̐ gūḍinadāna
daṁchī vaṭṭisaṇam̐gu tā nĕvvaroyī