Emtigi nanumaanamu yimkaam gomta danagu

ఏఁటికి ననుమానము యింకాఁ గొంత దనకు
Language

(॥పల్లవి॥)
ఏఁటికి ననుమానము యింకాఁ గొంత దనకు
గాఁటమై తెగినవాఁడు కడ మేలా

(॥ఏఁటి॥)
మనసురానివాఁడు మాయింటికి రా నేల
కినియించి కోపము రేఁగించ నేలా
పనితోఁ జుట్టుముఁ గాఁడు పగవాఁడూఁగాఁడు తాను
వునికిఁ దొల్లి వున్నట్టే వుండరాదా

(॥ఏఁటి॥)
విచ్చనవిడైనవాఁడు వేఁడుకో మమ్మిఁక నేల
చెచ్చెర నన్నింతరాఁగఁ జేయ నేలా
చొచ్చి బతిమి చెల్లదు సుకమూ దక్కుట లేదు
మెచ్చుగా తనసాజాన మెరయరాదా

(॥ఏఁటి॥)
మొగమోటలేనివాఁడు మోహము మామీఁద నేల
నిగిడి మమ్ముఁ గలసె నేఁడింత యేలా
తగుశ్రీవేంకటేశుఁడు తప్పుదారులెల్లాఁ దేరె
మగుమాను నన్ను నిట్టె మన్నించరాదా

(||pallavi||)
em̐ṭigi nanumānamu yiṁkām̐ gŏṁta danagu
gām̐ṭamai tĕginavām̐ḍu kaḍa melā

(||em̐ṭi||)
manasurānivām̐ḍu māyiṁṭigi rā nela
kiniyiṁchi kobamu rem̐giṁcha nelā
panidom̐ juṭṭumum̐ gām̐ḍu pagavām̐ḍūm̐gām̐ḍu tānu
vunigim̐ dŏlli vunnaṭṭe vuṁḍarādā

(||em̐ṭi||)
vichchanaviḍainavām̐ḍu vem̐ḍugo mammim̐ka nela
sĕchchĕra nanniṁtarām̐gam̐ jeya nelā
sŏchchi badimi sĕlladu sugamū dakkuḍa ledu
mĕchchugā tanasājāna mĕrayarādā

(||em̐ṭi||)
mŏgamoḍalenivām̐ḍu mohamu māmīm̐da nela
nigiḍi mammum̐ galasĕ nem̐ḍiṁta yelā
taguśhrīveṁkaḍeśhum̐ḍu tappudārulĕllām̐ derĕ
magumānu nannu niṭṭĕ manniṁcharādā