ఏఁటికి నన్నుఁ బొగడే విందరిలోనా
(॥పల్లవి॥)
ఏఁటికి నన్నుఁ బొగడే విందరిలోనా
నాఁటుకొని నీతో నిట్టె నవ్వేయంతదానవా
(॥ఏఁటి॥)
మన్నించి నీవు నాతో మాటలాడితివి గాక
యెన్నిక నీసతులతో నేమి బాఁతి
మున్ను నేఁ జేసినట్టి నోములఫల మింతే కాక
పిన్నను నిన్ను రతి మెప్పించేపాటిదాననా
(॥ఏఁటి॥)
చేరి నామీఁదికరుణఁ జెక్కు నొక్కే వింతే కాక
యీరీతి నావంటివారు యెంత లేదు
వేరే నిన్నుఁబొడగన్న వేళ గుణ మింతే కాక
బీరాన మాయింటికి రప్పించుకొనేదాననా
(॥ఏఁటి॥)
కొంకక నన్ను దిప్పించి కూడితి వింతే కాక
పొంకపునీతులతో పురుఁడి నాకు
అంకెల శ్రీ వేంకటేశ అంతా నీమహిమే కాక
వంక లొత్తి నే నిన్ను వలపించేదాననా
(||pallavi||)
em̐ṭigi nannum̐ bŏgaḍe viṁdarilonā
nām̐ṭugŏni nīdo niṭṭĕ navveyaṁtadānavā
(||em̐ṭi||)
manniṁchi nīvu nādo māḍalāḍidivi gāga
yĕnniga nīsadulado nemi bām̐ti
munnu nem̐ jesinaṭṭi nomulaphala miṁte kāga
pinnanu ninnu radi mĕppiṁchebāḍidānanā
(||em̐ṭi||)
seri nāmīm̐digaruṇam̐ jĕkku nŏkke viṁte kāga
yīrīdi nāvaṁṭivāru yĕṁta ledu
vere ninnum̐bŏḍaganna veḽa guṇa miṁte kāga
bīrāna māyiṁṭigi rappiṁchugŏnedānanā
(||em̐ṭi||)
kŏṁkaga nannu dippiṁchi kūḍidi viṁte kāga
pŏṁkabunīdulado purum̐ḍi nāgu
aṁkĕla śhrī veṁkaḍeśha aṁtā nīmahime kāga
vaṁka lŏtti ne ninnu valabiṁchedānanā