Emtigi nannu gumpimche veme neevu

ఏఁటికి నన్ను గుంపించే వేమే నీవు
Language

(॥పల్లవి॥)
ఏఁటికి నన్ను గుంపించే వేమే నీవు
చాటిచెప్పేవు నాకిది సఫలము గాదా

(॥॥)
కుప్పళించి నీవు నాకొంగువట్టి తీసేననే-
విప్పుడే లోకములెల్ల నేలనా నేను
పిప్పిగట్ట నీవు నాతో పెనఁగులాడవచ్చేవు
కప్పుచు నట్టైతే నాభాగ్యముగాదా ఇపుడు

(॥॥)
చేరి చేరి నామీఁద చేతులు చాఁచవచ్చేవు
గారవించ నాకిది ఘనతగాదా
ఆరితేరి నామేన నటు గోరు సోఁకించేవు
నేరుపుతో నాకిది నిధానముగాదా

(॥॥)
పిక్కటిల్లఁ గాఁగిట బిగియించవచ్చేవు
యెక్కువైనపదవి నా కిదేకాదా
చెక్కు నొక్కి కూడితివి శ్రీవేంకటేశుఁడ నేను
చొక్కపురతు లివెల్లా సోబనముగాదా

(||pallavi||)
em̐ṭigi nannu guṁpiṁche veme nīvu
sāḍisĕppevu nāgidi saphalamu gādā

(||||)
kuppaḽiṁchi nīvu nāgŏṁguvaṭṭi tīsenane-
vippuḍe logamulĕlla nelanā nenu
pippigaṭṭa nīvu nādo pĕnam̐gulāḍavachchevu
kappusu naṭṭaide nābhāgyamugādā ibuḍu

(||||)
seri seri nāmīm̐da sedulu sām̐savachchevu
gāraviṁcha nāgidi ghanadagādā
ārideri nāmena naḍu goru som̐kiṁchevu
nerubudo nāgidi nidhānamugādā

(||||)
pikkaḍillam̐ gām̐giḍa bigiyiṁchavachchevu
yĕkkuvainabadavi nā kidegādā
sĕkku nŏkki kūḍidivi śhrīveṁkaḍeśhum̐ḍa nenu
sŏkkaburadu livĕllā sobanamugādā