ఏఁటికి నన్ను భ్రమయించే వింకా
(॥పల్లవి॥)
ఏఁటికి నన్ను భ్రమయించే వింకా
కూటపు సరసమె గుఱుతులాయరా
(॥ఏఁటి॥)
చలమున వలపులు చల్లఁగఁ జల్లఁగ
నిలువున బులకలు నిండె నిదె
పలచనియెలుఁగునఁ బాడఁగ నామెయి
చెలమలచెమటలు చెరువులాయరా
(॥ఏఁటి॥)
చిక్కనినవ్వులు చిందఁగఁ జిందఁగ
ముక్కున నుసురులు ముంచె నిదె
కక్కసించి యిటుకన్నులార్చఁగా
మిక్కిలి తమకము మేరమీరెరా
(॥ఏఁటి॥)
బిగువుఁగాఁగిటిటనుఁ బిసుకఁగఁ బిసుకఁగ
పొగరుకుచగిరులు పొడవాయ
అగపడి కూడితి వలమేల్మంగను
పగటు శ్రీవేంకటపతి మరిగితిరా
(||pallavi||)
em̐ṭigi nannu bhramayiṁche viṁkā
kūḍabu sarasamĕ guṟudulāyarā
(||em̐ṭi||)
salamuna valabulu sallam̐gam̐ jallam̐ga
niluvuna bulagalu niṁḍĕ nidĕ
palasaniyĕlum̐gunam̐ bāḍam̐ga nāmĕyi
sĕlamalasĕmaḍalu sĕruvulāyarā
(||em̐ṭi||)
sikkaninavvulu siṁdam̐gam̐ jiṁdam̐ga
mukkuna nusurulu muṁchĕ nidĕ
kakkasiṁchi yiḍugannulārsam̐gā
mikkili tamagamu meramīrĕrā
(||em̐ṭi||)
biguvum̐gām̐giḍiḍanum̐ bisugam̐gam̐ bisugam̐ga
pŏgarugusagirulu pŏḍavāya
agabaḍi kūḍidi valamelmaṁganu
pagaḍu śhrīveṁkaḍabadi marigidirā