Emtigi nannelayimchi yimta seseene | tana

ఏఁటికి నన్నెలయించి యింత చేసీనే । తన
Language

(॥పల్లవి॥)
ఏఁటికి నన్నెలయించి యింత చేసీనే । తన-
కూటము లబ్బినదాఁకా కొలువులు సేసేనే

(॥ఎంటి॥)
తమకించవద్దు గాని తనపనులు నామేను
చెమరించినందాఁకాఁ జేసేనే
భ్రమఇంచవద్దుగాని పక్కనఁదానామీఁద
మమత వుట్టినందాఁకా మాటలాడేనే

(॥ఎంటి॥)
వేసరించవద్దుగాని వేడుకతోఁ దా నాపై
సెసవెట్టినందాఁకాఁ జేరి మొక్కేనే
పాసివుండవద్దుగాని బత్తిచేసినందాఁకా
లాసి తనతోనే మేలములాడేనే

(॥ఏంటి॥)
చలపట్టవద్దుగాని చనవిచ్చనందాఁకా
కొలువులోఁ దొడమీఁదఁ గూచుండేనే
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
వెలసినందాఁకాను వేడుకచేసేనే

(||pallavi||)
em̐ṭigi nannĕlayiṁchi yiṁta sesīne | tana-
kūḍamu labbinadām̐kā kŏluvulu sesene

(||ĕṁṭi||)
tamagiṁchavaddu gāni tanabanulu nāmenu
sĕmariṁchinaṁdām̐kām̐ jesene
bhrama̮iṁchavaddugāni pakkanam̐dānāmīm̐da
mamada vuṭṭinaṁdām̐kā māḍalāḍene

(||ĕṁṭi||)
vesariṁchavaddugāni veḍugadom̐ dā nābai
sĕsavĕṭṭinaṁdām̐kām̐ jeri mŏkkene
pāsivuṁḍavaddugāni battisesinaṁdām̐kā
lāsi tanadone melamulāḍene

(||eṁṭi||)
salabaṭṭavaddugāni sanavichchanaṁdām̐kā
kŏluvulom̐ dŏḍamīm̐dam̐ gūsuṁḍene
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
vĕlasinaṁdām̐kānu veḍugasesene