ఏఁటికి నానలు వెట్టే విట్టే నీవాఁడ ననుచు
(॥పల్లవి॥)
ఏఁటికి నానలు వెట్టే విట్టే నీవాఁడ ననుచు
పోఁటిగా నీ మేననున్న పులకలే గురుతు
(॥ఏఁటి॥)
తిరిగి తిరిగి నన్ను దిష్టించి చూచితి గాన
అరిది నాపై మోహన కది గురుతు
తరుణులు చూడఁగానే దగ్గరి వుంటివి గాన
మరిగినందుకు నన్ను మరి యిది గురుతు
(॥ఏఁటి॥)
అందరిలో నెంతైనా నంపఁజాల వటు గాన
అంది మన్నించేయందు కది గురుతు
మందెమేళముగ నాతో మాటలాడే వటు గాన
యెందు నీ నాతగులుకు నీదొక్కటే గురుతు
(॥ఏఁటి॥)
వేసరక నాతోడ వెస నవ్వితివి గాన
ఆస నాపైఁ జేసుటకు నది గురుతు
శ్రీ సతితో నేలితివి శ్రీవేంకటేశ్వర నన్ను
నే నాపైఁ బెట్టుటకు చెనకుటే గురుతు
(||pallavi||)
em̐ṭigi nānalu vĕṭṭe viṭṭe nīvām̐ḍa nanusu
pom̐ṭigā nī menanunna pulagale gurudu
(||em̐ṭi||)
tirigi tirigi nannu diṣhṭiṁchi sūsidi gāna
aridi nābai mohana kadi gurudu
taruṇulu sūḍam̐gāne daggari vuṁṭivi gāna
mariginaṁdugu nannu mari yidi gurudu
(||em̐ṭi||)
aṁdarilo nĕṁtainā naṁpam̐jāla vaḍu gāna
aṁdi manniṁcheyaṁdu kadi gurudu
maṁdĕmeḽamuga nādo māḍalāḍe vaḍu gāna
yĕṁdu nī nādagulugu nīdŏkkaḍe gurudu
(||em̐ṭi||)
vesaraga nādoḍa vĕsa navvidivi gāna
āsa nābaim̐ jesuḍagu nadi gurudu
śhrī sadido nelidivi śhrīveṁkaḍeśhvara nannu
ne nābaim̐ bĕṭṭuḍagu sĕnaguḍe gurudu