(॥పల్లవి॥)
ఏఁటికి నాతని దూరే రేమమ్మ
మాటలాడి నప్పుడే సమ్మతి గదవమ్మా
(॥ఏఁటి॥)
యెనసి ఆతఁడు నేఁ డెందుండి వచ్చినాను నీ-
కనుచూపులకు లోను గదవమ్మ
వెనక కాతఁడు యేవెలఁదింట నుండినా నీ-
మనసునకు నడ్డమా మరి యాతఁడమ్మా
(॥ఏఁటి॥)
యేమగువతో సరసమెంతాడి వచ్చినాను
కామించిన నీమగఁడు గదవమ్మ
వేమరు నెవ్వరియింట విందారగించినాను
వోముచు నిద్దరిమేను లొక్కటే కదవమ్మా
(॥ఏఁటి॥)
చేఁగదేర నాతఁడెంతచేఁత సేసి వచ్చినాను
కాఁగిట నాతఁడు గూడెఁ గదవమ్మా
వీఁగక శ్రీవేంకటాద్రివిభుఁ డిట్టె వున్న వాఁడు
దాఁగక ని న్నురమున ధరించెఁ గదవమ్మా
(||pallavi||)
em̐ṭigi nādani dūre remamma
māḍalāḍi nappuḍe sammadi gadavammā
(||em̐ṭi||)
yĕnasi ādam̐ḍu nem̐ ḍĕṁduṁḍi vachchinānu nī-
kanusūbulagu lonu gadavamma
vĕnaga kādam̐ḍu yevĕlam̐diṁṭa nuṁḍinā nī-
manasunagu naḍḍamā mari yādam̐ḍammā
(||em̐ṭi||)
yemaguvado sarasamĕṁtāḍi vachchinānu
kāmiṁchina nīmagam̐ḍu gadavamma
vemaru nĕvvariyiṁṭa viṁdāragiṁchinānu
vomusu niddarimenu lŏkkaḍe kadavammā
(||em̐ṭi||)
sem̐gadera nādam̐ḍĕṁtasem̐ta sesi vachchinānu
kām̐giḍa nādam̐ḍu gūḍĕm̐ gadavammā
vīm̐gaga śhrīveṁkaḍādrivibhum̐ ḍiṭṭĕ vunna vām̐ḍu
dām̐gaga ni nnuramuna dhariṁchĕm̐ gadavammā