Emtigi mamkumdanamu yee velanu

ఏఁటికి మంకుఁదనము యీ వేళను
Language

(॥పల్లవి॥)
ఏఁటికి మంకుఁదనము యీ వేళను
గాఁటాన నొడఁబరచీఁ గానిమ్మనఁ గదవే

(॥ఏఁటి॥)
చలము సాదించఁబోతే చప్పనౌను బ్రియము
బలిమిసేయఁగఁబోతే పలచనౌను
పిలువఁగ రాకున్న బెట్టుగా వేసటవుట్టు
చెలఁగి నీ రమణుఁడు చెప్పినట్టు సేయవే

(॥ఏఁటి॥)
యెదురు మాటాడితే యెగసక్యమౌ పొందు
పదరితే కడుఁగడుఁ బాటి చాలదు
పొదుగఁగ నూరకున్న పోరచి కాఁకలు రేఁగు
అదన నీపతిమతి ఆస యీడేరించవే

(॥ఏఁటి॥)
చేవల్లకు రాకుండితేఁ జిగిరించు పంతము
భావించక లోఁచితేను పచ్చిదేరును
యీవేళఁ గూడె నిన్నునింటికిఁ దానే వచ్చి
శ్రీ వేంకటేశ్వరుఁడు చెనకీని నవ్వవే

(||pallavi||)
em̐ṭigi maṁkum̐danamu yī veḽanu
gām̐ṭāna nŏḍam̐barasīm̐ gānimmanam̐ gadave

(||em̐ṭi||)
salamu sādiṁcham̐bode sappanaunu briyamu
balimiseyam̐gam̐bode palasanaunu
piluvam̐ga rāgunna bĕṭṭugā vesaḍavuṭṭu
sĕlam̐gi nī ramaṇum̐ḍu sĕppinaṭṭu seyave

(||em̐ṭi||)
yĕduru māḍāḍide yĕgasakyamau pŏṁdu
padaride kaḍum̐gaḍum̐ bāḍi sāladu
pŏdugam̐ga nūragunna porasi kām̐kalu rem̐gu
adana nībadimadi āsa yīḍeriṁchave

(||em̐ṭi||)
sevallagu rāguṁḍidem̐ jigiriṁchu paṁtamu
bhāviṁchaga lom̐sidenu pachchiderunu
yīveḽam̐ gūḍĕ ninnuniṁṭigim̐ dāne vachchi
śhrī veṁkaḍeśhvarum̐ḍu sĕnagīni navvave