ఏఁటికి జేసేవు నాతో నింకా గుట్టు
(॥పల్లవి॥)
ఏఁటికి జేసేవు నాతో నింకా గుట్టు
యీటువెట్టి సతులకు నిదె చాలౌఁ జుమ్మీ
(॥ఏటి॥)
అన్నువచెమటలతో నలసి నీవు రాఁగాను
నిన్నుఁ జూచి నామనసు నీరాయను
యిన్నిటా నానతీవయ్య యెవ్వతె నీ కింత సేసె
పన్ని వాదువెట్టుకొని పచరించే నాపెను
(॥ఏటి॥)
వింతవింతనీమేనివెడవెడగురుతులు
కొంతగొంత వొడగని కోపమాయను
పంతగత్తె యెవ్వతె యీపాట్లఁబెట్టెను నిన్ను
రంతుల నందరిలోన రచ్చవేసేను
(॥ఏటి॥)
కందువకు వచ్చి నన్ను గాఁగిలించి కూడఁగాను
విందులనీనేర్పులకు వెరగాయను
అందపు శ్రీవేంకటేశ అవ్వల నెవ్వతె నేర్పె
చందము సేసుక నేను సారె మెచ్చే నాపెను
(||pallavi||)
em̐ṭigi jesevu nādo niṁkā guṭṭu
yīḍuvĕṭṭi sadulagu nidĕ sālaum̐ jummī
(||eḍi||)
annuvasĕmaḍalado nalasi nīvu rām̐gānu
ninnum̐ jūsi nāmanasu nīrāyanu
yinniḍā nānadīvayya yĕvvadĕ nī kiṁta sesĕ
panni vāduvĕṭṭugŏni pasariṁche nābĕnu
(||eḍi||)
viṁtaviṁtanīmenivĕḍavĕḍagurudulu
kŏṁtagŏṁta vŏḍagani kobamāyanu
paṁtagattĕ yĕvvadĕ yībāṭlam̐bĕṭṭĕnu ninnu
raṁtula naṁdarilona rachchavesenu
(||eḍi||)
kaṁduvagu vachchi nannu gām̐giliṁchi kūḍam̐gānu
viṁdulanīnerbulagu vĕragāyanu
aṁdabu śhrīveṁkaḍeśha avvala nĕvvadĕ nerbĕ
saṁdamu sesuga nenu sārĕ mĕchche nābĕnu