Emtigi jaagulu sese vemdaamkaa sarasaalu

ఏఁటికి జాగులు సేసే వెందాఁకా సరసాలు
Language

(॥పల్లవి॥)
ఏఁటికి జాగులు సేసే వెందాఁకా సరసాలు
వాఁటము సేసీ యాపెపై వంచరాదా నవ్వులు

(॥ఏఁటి॥)
పంతము నీమీఁద వేసి పాదాన నేలలు వ్రాసి
చింతతోడ నున్న దదె చెలియ
వంతతో మారలుగక వద్దికి వచ్చి ఆపె
సంతోసపు మాటలాడీ చల్లరాదా వలపు

(॥ఏఁటి॥)
కెంపుఁగనుఁగవ మీర గీరునామము జార
తెంపుతోడ నున్నదదె తెఅ(ఱ?)వ
ముంపున నెగ్గుపట్టక ముచ్చటలు బుజ్జగించి
ఇంపులనే చెక్కునొక్కీ ఇయ్యరాదా చనవు

(॥ఏఁటి॥)
కాయమెల్లాఁ బులకించి కాఁకలు నీమీఁద నించి
చేయిచాఁచె నీకుఁగానే చెలియ
యీయెడ శ్రీ వేంకటేశ ఇంతి నిట్టె కూడితివి
తీయనిమోవి ఇచ్చీ తిప్పరాదా చలము

(||pallavi||)
em̐ṭigi jāgulu sese vĕṁdām̐kā sarasālu
vām̐ṭamu sesī yābĕbai vaṁcharādā navvulu

(||em̐ṭi||)
paṁtamu nīmīm̐da vesi pādāna nelalu vrāsi
siṁtadoḍa nunna dadĕ sĕliya
vaṁtado māralugaga vaddigi vachchi ābĕ
saṁtosabu māḍalāḍī sallarādā valabu

(||em̐ṭi||)
kĕṁpum̐ganum̐gava mīra gīrunāmamu jāra
tĕṁpudoḍa nunnadadĕ tĕa(ṟa?)va
muṁpuna nĕggubaṭṭaga muchchaḍalu bujjagiṁchi
iṁpulane sĕkkunŏkkī iyyarādā sanavu

(||em̐ṭi||)
kāyamĕllām̐ bulagiṁchi kām̐kalu nīmīm̐da niṁchi
seyisām̐sĕ nīgum̐gāne sĕliya
yīyĕḍa śhrī veṁkaḍeśha iṁti niṭṭĕ kūḍidivi
tīyanimovi ichchī tipparādā salamu