Emtigi jaagulu sese rimkaa meeru

ఏఁటికి జాగులు సేసే రింకా మీరు
Language

(॥పల్లవి॥)
ఏఁటికి జాగులు సేసే రింకా మీరు
చాటి చెప్ప పతి నిట్టె జరయరమ్మా

(॥ఏటికి॥)
వలచినవలపులు వనితమేనిమీఁదికి
పులక లై మొలచె నిప్పుడు చూడరే
యెలమిఁ గాఁక లనేటియెన్నులు వెళ్ళక తొల్లె
నెల వై చలిమందులు నించరమ్మా

(॥ఏటికి॥)
చిత్తములో చింత లెల్ల చెమట లై సతిమేన
జొత్తులు గారఁగఁ జొచ్చె జూడరె యిది
యెత్తనతమకముల యేరులు వారక తొల్లె
వొత్తి పువ్వుఁబొట్లాల నొగిఁ గాఁచరమ్మా

(॥ఏటి॥)
కడ లేనిజవ్వనము కలికి నిట్టూరుపులై
విడువక చెలరేఁగి వేఁచఁ జొచ్చెను
తొడరి విరహ మనేదుమ్ములు రేఁగక తొల్లె
అడరి శ్రీవేంకటేశుఁ డాదరించె నమ్మా

(||pallavi||)
em̐ṭigi jāgulu sese riṁkā mīru
sāḍi sĕppa padi niṭṭĕ jarayarammā

(||eḍigi||)
valasinavalabulu vanidamenimīm̐digi
pulaga lai mŏlasĕ nippuḍu sūḍare
yĕlamim̐ gām̐ka laneḍiyĕnnulu vĕḽḽaga tŏllĕ
nĕla vai salimaṁdulu niṁcharammā

(||eḍigi||)
sittamulo siṁta lĕlla sĕmaḍa lai sadimena
jŏttulu gāram̐gam̐ jŏchchĕ jūḍarĕ yidi
yĕttanadamagamula yerulu vāraga tŏllĕ
vŏtti puvvum̐bŏṭlāla nŏgim̐ gām̐sarammā

(||eḍi||)
kaḍa lenijavvanamu kaligi niṭṭūrubulai
viḍuvaga sĕlarem̐gi vem̐sam̐ jŏchchĕnu
tŏḍari viraha manedummulu rem̐gaga tŏllĕ
aḍari śhrīveṁkaḍeśhum̐ ḍādariṁchĕ nammā