ఏఁటికి గుంపెన లిఁకనేలే నీకు
(॥పల్లవి॥)
ఏఁటికి గుంపెన లిఁకనేలే నీకు
కూటమి రతులకుఁ గొసరఁగ రాదా
(॥॥)
వొడివట్టుచునుఁ బతి వొడఁబరచఁగాను
జడియుచుఁ బలికి కసరుదురటే
అడరి కెమ్మోవితేనియలు గురిసీ నదే
తొడరి నీవుబువ్వము దొడుకఁగరాదా
(॥॥)
నమ్మిక లొసగుచు నవ్వులు నవ్వఁగాను
చిమ్ముచు నాఱడి యింతసేతురటే
వుమ్మడిఁగుచము లాతఁడొరసీ: వలపులు
నెమ్మి చుట్టరికములు నెఱపఁగరాదా
(॥॥)
కలయుచుఁ గాఁగిట కందువ లంటగాను
కెలయుచుఁ గడును జంకింతురటే
యెలమిని శ్రీ వేంకటేశఁడు మన్నించీని
పలుకుఁబంతముల పై కొనరాదా
(||pallavi||)
em̐ṭigi guṁpĕna lim̐kanele nīgu
kūḍami radulagum̐ gŏsaram̐ga rādā
(||||)
vŏḍivaṭṭusunum̐ badi vŏḍam̐barasam̐gānu
jaḍiyusum̐ baligi kasaruduraḍe
aḍari kĕmmovideniyalu gurisī nade
tŏḍari nīvubuvvamu dŏḍugam̐garādā
(||||)
nammiga lŏsagusu navvulu navvam̐gānu
simmusu nāṟaḍi yiṁtaseduraḍe
vummaḍim̐gusamu lādam̐ḍŏrasī: valabulu
nĕmmi suṭṭarigamulu nĕṟabam̐garādā
(||||)
kalayusum̐ gām̐giḍa kaṁduva laṁṭagānu
kĕlayusum̐ gaḍunu jaṁkiṁturaḍe
yĕlamini śhrī veṁkaḍeśham̐ḍu manniṁchīni
palugum̐baṁtamula pai kŏnarādā