Emtigi dosaalugatte vimtalo maagu

ఏఁటికి దోసాలుగట్టే వింతలో మాకు
Language

(॥పల్లవి॥)
ఏఁటికి దోసాలుగట్టే వింతలో మాకు
పాటించి నాకుఁగా నేలో భ్రమసేవుగాక

(॥ఏటి॥)
నచ్చి నీమాటలకెల్ల నాఁడే నే లోఁగాన
ముచ్చట దీరక నీవే మొక్కేవుగాక
యిచ్చకురాలనై నీకు నే నేమయినాఁ జేయనా
పచ్చిగా వలచి వొడఁబరచేవుగాక

(॥ఏటి॥)
కన్నులఁ జూచినప్పుడే కరఁగదా నామనసు
చన్నులంటి చొక్కుఁజూపు చల్లేవుగాక
సన్న సేసినంతలోనే సరసములాడనా
చిన్నికొనగోరు నాపైఁ జిమ్మేవుగాక

(॥ఏటి॥)
కందువకు రాఁగానే కాఁగిలించనా నిన్ను
చెంది ప్రియా లప్పటినిఁ జెప్పేవుగాక
విందువలె నన్నిటా శ్రీవేంకటేశ కూడితివి
మందెమేళాలు మీరేనా మన్నించేవుగాక

(||pallavi||)
em̐ṭigi dosālugaṭṭe viṁtalo māgu
pāḍiṁchi nāgum̐gā nelo bhramasevugāga

(||eḍi||)
nachchi nīmāḍalagĕlla nām̐ḍe ne lom̐gāna
muchchaḍa dīraga nīve mŏkkevugāga
yichchagurālanai nīgu ne nemayinām̐ jeyanā
pachchigā valasi vŏḍam̐barasevugāga

(||eḍi||)
kannulam̐ jūsinappuḍe karam̐gadā nāmanasu
sannulaṁṭi sŏkkum̐jūbu sallevugāga
sanna sesinaṁtalone sarasamulāḍanā
sinnigŏnagoru nābaim̐ jimmevugāga

(||eḍi||)
kaṁduvagu rām̐gāne kām̐giliṁchanā ninnu
sĕṁdi priyā lappaḍinim̐ jĕppevugāga
viṁduvalĕ nanniḍā śhrīveṁkaḍeśha kūḍidivi
maṁdĕmeḽālu mīrenā manniṁchevugāga