ఏఁటికి దాఁచేవు మాకు నిందు కిట్టె వద్దనేమా
(॥పల్లవి॥)
ఏఁటికి దాఁచేవు మాకు నిందు కిట్టె వద్దనేమా
జూటరివలపులు మెయి చొక్కించీని
(॥॥)
ఇన్నిటా నాపెనీసంది యెరుకగలందుకు
కన్నులచూపులలోనే కానవచ్చెను
పన్ని యాపెచే నీమాటపట్టు వుచ్చుకొన్నందుకు
మన్నించినందులోనే మాకల్లాఁ దెలిసెను
(॥॥)
అంగవించి మీరు చుట్టాలై వుండినయందుకు
యెంగిలిపొత్తు గూడిన నెరిఁగితిమి
అంగము లొకరొకరి అంటి పెనఁగినందుకు
వుంగరాలు నీడు జోడై వుండఁగానే కంటిమి
(॥॥)
వొగ్గి ఆలుమగఁడు నై వొద్దికై వుండినందుకు
సిగ్గులు వడినయందే చిమ్మిరేఁగెను
అగ్గమై యలమేల్మంగనైనందుకు నన్నేలితి
తగ్గక శ్రీ వేంకటేశు తమి చొప్పులెత్తెను
(||pallavi||)
em̐ṭigi dām̐sevu māgu niṁdu kiṭṭĕ vaddanemā
jūḍarivalabulu mĕyi sŏkkiṁchīni
(||||)
inniḍā nābĕnīsaṁdi yĕrugagalaṁdugu
kannulasūbulalone kānavachchĕnu
panni yābĕse nīmāḍabaṭṭu vuchchugŏnnaṁdugu
manniṁchinaṁdulone māgallām̐ dĕlisĕnu
(||||)
aṁgaviṁchi mīru suṭṭālai vuṁḍinayaṁdugu
yĕṁgilibŏttu gūḍina nĕrim̐gidimi
aṁgamu lŏgarŏgari aṁṭi pĕnam̐ginaṁdugu
vuṁgarālu nīḍu joḍai vuṁḍam̐gāne kaṁṭimi
(||||)
vŏggi ālumagam̐ḍu nai vŏddigai vuṁḍinaṁdugu
siggulu vaḍinayaṁde simmirem̐gĕnu
aggamai yalamelmaṁganainaṁdugu nannelidi
taggaga śhrī veṁkaḍeśhu tami sŏppulĕttĕnu