ఏఁటికి భ్రమసేవే యెదురుబడి
(॥పల్లవి॥)
ఏఁటికి భ్రమసేవే యెదురుబడి
చాటీఁ గొసరులు చన వియ్యవయ్యా
(॥ఏంటి॥)
సిగ్గరితనమున చిడుముడిఁ జేతులు
వొగ్గీ విడెఁ(డెం?) బొసగవయ్యా
నిగ్గుల నూరక నిలుచున్నది చెలి
బగ్గున నీతొడపయి నిలుపవయ్యా
(॥ఏంటి॥)
కొమరెతనంబునఁ గొంకుచుఁ బిలిచీ
ప్రమదంబున నిటు పలుకవయ్యా
చెమటమేనితోసెలవుల నవ్వీని
అమరఁగ గాఁగిట నంకించవయ్యా
(॥ఏంటి॥)
వాసితనంబున వంచినశిరసున
సేసలు వెట్టీఁ జెనకవయ్యా
అసల శ్రీవేంకటేధిప కలసితి
యీసిరులతోనే యేలవయ్యా
(||pallavi||)
em̐ṭigi bhramaseve yĕdurubaḍi
sāḍīm̐ gŏsarulu sana viyyavayyā
(||eṁṭi||)
siggaridanamuna siḍumuḍim̐ jedulu
vŏggī viḍĕm̐(ḍĕṁ?) bŏsagavayyā
niggula nūraga nilusunnadi sĕli
bagguna nīdŏḍabayi nilubavayyā
(||eṁṭi||)
kŏmarĕdanaṁbunam̐ gŏṁkusum̐ bilisī
pramadaṁbuna niḍu palugavayyā
sĕmaḍamenidosĕlavula navvīni
amaram̐ga gām̐giḍa naṁkiṁchavayyā
(||eṁṭi||)
vāsidanaṁbuna vaṁchinaśhirasuna
sesalu vĕṭṭīm̐ jĕnagavayyā
asala śhrīveṁkaḍedhiba kalasidi
yīsiruladone yelavayyā