Emtigi anumaanaalu yemdaamkaanu

ఏఁటికి అనుమానాలు యెందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఏఁటికి అనుమానాలు యెందాఁకాను
వాఁటమైతే వలపుల వన్నెలు దీసీనా

(॥ఏఁటి॥)
సిగ్గువడివున్నచెలిఁ జేయివట్టి తియ్యరాదా
వొగ్గి యెంతవడిదాఁకా నూరకుండేవు
వెగ్గళించి యాపె నిన్ను వేసరించన నున్నది
బగ్గనఁ జెనకితే నీ పంతము దప్పీనా

(॥ఏఁటి॥)
వొంటినున్న నీవనితవొద్దనే కూచుండరాదా
అంటిముట్టిక యెందాఁకా నడ్డాఁకలు
గొంటరియై యాపె నిన్నుఁ గొసరఁజాలకున్నది
నంటుసేసితే నిన్ను నవ్వరా నీసతులు

(॥ఏఁటి॥)
మలశున్న దలమేలుమంగఁ గాఁగిలించరాదా
సెలవిన వ్వెందాకా శ్రీవేంకటేశ
కలసితి వాపె నీకుఁ గడుమేరతో నున్నది
అలపు దేరిచితే నీయాయము సోఁకీనా

(||pallavi||)
em̐ṭigi anumānālu yĕṁdām̐kānu
vām̐ṭamaide valabula vannĕlu dīsīnā

(||em̐ṭi||)
sigguvaḍivunnasĕlim̐ jeyivaṭṭi tiyyarādā
vŏggi yĕṁtavaḍidām̐kā nūraguṁḍevu
vĕggaḽiṁchi yābĕ ninnu vesariṁchana nunnadi
bagganam̐ jĕnagide nī paṁtamu dappīnā

(||em̐ṭi||)
vŏṁṭinunna nīvanidavŏddane kūsuṁḍarādā
aṁṭimuṭṭiga yĕṁdām̐kā naḍḍām̐kalu
gŏṁṭariyai yābĕ ninnum̐ gŏsaram̐jālagunnadi
naṁṭuseside ninnu navvarā nīsadulu

(||em̐ṭi||)
malaśhunna dalamelumaṁgam̐ gām̐giliṁcharādā
sĕlavina vvĕṁdāgā śhrīveṁkaḍeśha
kalasidi vābĕ nīgum̐ gaḍumerado nunnadi
alabu deriside nīyāyamu som̐kīnā