ఏఁటికి ఆఁటదానికి నింతగర్వము వలెనా
(॥పల్లవి॥)
ఏఁటికి ఆఁటదానికి నింతగర్వము వలెనా
మేఁటి రతుల చేతనే మెప్పించుటగాక
(॥ఏటి॥)
మాటలాడేపతితోడ మరి పరాకేఁటికే
కాటుకకన్నులఁ జూచి కైకొంటగాక
కూటమికిఁ బెనఁగఁగా గుట్టు చూపనేఁటికే
చాటించి మోవివిందులు చవిరేఁచుటగాక
(॥ఏటి॥)
నవ్వునవ్వే పతియెడ నాలితన మేఁటికే
రవ్వగాఁ జన్నులనొత్తి రాయుటగాక
పువ్వులు ముడువఁగాను బొమ్మజంకెనేఁటికే
జవ్వనపాయము పొందు జరపుటగాక
(॥ఏటి॥)
కూడేశ్రీవేంకటపతిఁ గొసరఁగనేఁటికే
జాడతో వలపు పై పైఁ జల్లుటగాక
వేడుక నెనసితివి వేగిరము లేఁటికే
పాడిపంతము మెరసి పనిగొంటగాక
(||pallavi||)
em̐ṭigi ām̐ṭadānigi niṁtagarvamu valĕnā
mem̐ṭi radula sedane mĕppiṁchuḍagāga
(||eḍi||)
māḍalāḍebadidoḍa mari parāgem̐ṭige
kāḍugagannulam̐ jūsi kaigŏṁṭagāga
kūḍamigim̐ bĕnam̐gam̐gā guṭṭu sūbanem̐ṭige
sāḍiṁchi moviviṁdulu savirem̐suḍagāga
(||eḍi||)
navvunavve padiyĕḍa nālidana mem̐ṭige
ravvagām̐ jannulanŏtti rāyuḍagāga
puvvulu muḍuvam̐gānu bŏmmajaṁkĕnem̐ṭige
javvanabāyamu pŏṁdu jarabuḍagāga
(||eḍi||)
kūḍeśhrīveṁkaḍabadim̐ gŏsaram̐ganem̐ṭige
jāḍado valabu pai paim̐ jalluḍagāga
veḍuga nĕnasidivi vegiramu lem̐ṭige
pāḍibaṁtamu mĕrasi panigŏṁṭagāga