ఏఁటికే యీ దోసము మీరెఱఁగరటే
(॥పల్లవి॥)
ఏఁటికే యీ దోసము మీరెఱఁగరటే
ఆఁటదాన నింతే నన్ను ఆఱడిఁ బెట్టకురే
(॥ఏఁటికే॥)
తామరమొగ్గలవంటి తగిన నాచన్నులివి
కామునియమ్ములనేరు కాంతలిదేమే
నామగనికౌఁగిటిలో ననిచే జక్కవలవి
ప్రేమమున మారుఁబేరు పెట్టుదురటే
(॥ఏఁటికే॥)
చందురునిఁ బోలేటి సరసపు నా మోము
అందపుఁబూబంతియంటానాడుకోకురే
ముందు నారమణునికి మోము చూచేటద్దమిది
కందువలేని నిందలు గడింతురటే
(॥ఏఁటికే॥)
తీగెవంటి నామేను దిక్కుల మెఱుఁగనుచు
పోగులుగా సారెసారెఁ బొగడకురే
బాగుగ శ్రీ వేంకటేశు పానుపుపై చిగురిది
యోగము గూడెను వేరే వుప్పటించనేఁటికే
(||pallavi||)
em̐ṭige yī dosamu mīrĕṟam̐garaḍe
ām̐ṭadāna niṁte nannu āṟaḍim̐ bĕṭṭagure
(||em̐ṭige||)
tāmaramŏggalavaṁṭi tagina nāsannulivi
kāmuniyammulaneru kāṁtalideme
nāmaganigaum̐giḍilo nanise jakkavalavi
premamuna mārum̐beru pĕṭṭuduraḍe
(||em̐ṭige||)
saṁdurunim̐ boleḍi sarasabu nā momu
aṁdabum̐būbaṁtiyaṁṭānāḍugogure
muṁdu nāramaṇunigi momu sūseḍaddamidi
kaṁduvaleni niṁdalu gaḍiṁturaḍe
(||em̐ṭige||)
tīgĕvaṁṭi nāmenu dikkula mĕṟum̐ganusu
pogulugā sārĕsārĕm̐ bŏgaḍagure
bāguga śhrī veṁkaḍeśhu pānububai siguridi
yogamu gūḍĕnu vere vuppaḍiṁchanem̐ṭige