Emtige tanagu verabimtalonane

ఏఁటికే తనకు వెరపింతలోననే
Language

(॥పల్లవి॥)
ఏఁటికే తనకు వెరపింతలోననే
మాటెందులేని బిరుదు మగవాఁడు గదవే

(॥ఏఁటి॥)
పేరుకొని పిలువఁగఁ బ్రియమునఁ బలుకఁడు
సారె నెవ్వతై నాను సాదించీనటే
గారవించి తనకు నేఁ గానకియ్యఁగాఁ బట్టఁడు
కూరిమి మరెవ్వతైనా కోపగించీనటవే

(॥ఏఁటి॥)
ననుపున నేనెంత నవివ్వనాఁ దా నవ్వఁడు
చనవున నెవ్వతైనా జంకించీనటే
చెనకి నేఁ దనకు సేవ సేయఁగాఁ గొంకీని
తనపై మరెవ్వతైనాఁ దప్పు వెంచీనటెవే

(॥ఏఁటి॥)
ముచ్చట నేఁ జేతులెత్తి మొక్కితేఁ దలవంచీని
వచ్చి వచ్చి యెవ్వతైనా వద్దనీనటే
అచ్చపు శ్రీ వేంకటేశుఁ డలమేలుమంగ నేను
యిచ్చ నన్నుఁ గూడె మది యెవ్వతె మీరీనే

(||pallavi||)
em̐ṭige tanagu vĕrabiṁtalonane
māḍĕṁduleni birudu magavām̐ḍu gadave

(||em̐ṭi||)
perugŏni piluvam̐gam̐ briyamunam̐ balugam̐ḍu
sārĕ nĕvvadai nānu sādiṁchīnaḍe
gāraviṁchi tanagu nem̐ gānagiyyam̐gām̐ baṭṭam̐ḍu
kūrimi marĕvvadainā kobagiṁchīnaḍave

(||em̐ṭi||)
nanubuna nenĕṁta navivvanām̐ dā navvam̐ḍu
sanavuna nĕvvadainā jaṁkiṁchīnaḍe
sĕnagi nem̐ danagu seva seyam̐gām̐ gŏṁkīni
tanabai marĕvvadainām̐ dappu vĕṁchīnaḍĕve

(||em̐ṭi||)
muchchaḍa nem̐ jedulĕtti mŏkkidem̐ dalavaṁchīni
vachchi vachchi yĕvvadainā vaddanīnaḍe
achchabu śhrī veṁkaḍeśhum̐ ḍalamelumaṁga nenu
yichcha nannum̐ gūḍĕ madi yĕvvadĕ mīrīne