ఏఁటికయ్యా నీతో మాకు యేలాటములాడను
(॥పల్లవి॥)
ఏఁటికయ్యా నీతో మాకు యేలాటములాడను
చీటికిమాటికి సంతోసించుటేకాక
(॥ఏటి॥)
సులభమా నీతోను సొలసి మాటాడేది
అలరి నీ కిచ్చలాడేఆఁటదానను
తలవంచుకొని నీదండ నిట్టె కాచుకుండి
చెలగి నీ చెప్పినట్టుసేసే దింతేకాక
(॥ఏటి॥)
గరువమా నాకు నిన్నుఁ గదిసి తప్పకచూడ
ఇరవుగఁ బెండ్లాడినయిల్లాలను
వరుసతో నీచిత్తమువచ్చినట్టే సేవసేసి
బెరసి నీచేత మెప్పించుకొంటగాక
(॥ఏటి॥)
యెమ్మెలా నీతో నేను యెలయించి నవ్వునవ్వ
నెమ్మి నలమేల్ మంగను నీదేవులను
యిమ్ముల శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
వుమ్మడిరతులఁ గూడి వుండు టింతేకాక
(||pallavi||)
em̐ṭigayyā nīdo māgu yelāḍamulāḍanu
sīḍigimāḍigi saṁtosiṁchuḍegāga
(||eḍi||)
sulabhamā nīdonu sŏlasi māḍāḍedi
alari nī kichchalāḍeām̐ṭadānanu
talavaṁchugŏni nīdaṁḍa niṭṭĕ kāsuguṁḍi
sĕlagi nī sĕppinaṭṭusese diṁtegāga
(||eḍi||)
garuvamā nāgu ninnum̐ gadisi tappagasūḍa
iravugam̐ bĕṁḍlāḍinayillālanu
varusado nīsittamuvachchinaṭṭe sevasesi
bĕrasi nīseda mĕppiṁchugŏṁṭagāga
(||eḍi||)
yĕmmĕlā nīdo nenu yĕlayiṁchi navvunavva
nĕmmi nalamel maṁganu nīdevulanu
yimmula śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
vummaḍiradulam̐ gūḍi vuṁḍu ṭiṁtegāga