ఏఁటిదో నీ మతకము యెఱఁగ నేను
(॥పల్లవి॥)
ఏఁటిదో నీ మతకము యెఱఁగ నేను
నోటి నీ యానలకు వీనులు మూసీఁ దాను
(॥ఏటి॥)
యేతలఁపు దెలిసెనో యెచ్చుకుందు గలిగెనో
నాతో నీవు మాఁటాడఁగ నవ్వీ నాపె
కాతరాన నీవు నాకు కడుగిందుపడి యిట్టె
చేతులు ఛాఁచఁగాను సిగ్గువడీఁ దాను
(॥ఏటి॥)
యేకడ దెచ్చితివో యెందరి భ్రమయింతువో
నాకు విడెమియ్యఁగాను నవ్వీ నాపె
జోకకు నాసింగారాలు చూచి చూచి సారెకు
దాకొని నీవు మెచ్చఁగ తలవూఁచీఁ దాను
(॥ఏటి॥)
యేపున వింతకుముందే యెవ్వతెఁ బెండ్లాడితివో
నాపై సేసవెట్టఁగ నవ్వీ నాపె
రాపుగ శ్రీవేంకటేశ రతి నన్నుఁ గూడితివి
చాపలాన నింతలోనే సంతసించీఁ దాను
(||pallavi||)
em̐ṭido nī madagamu yĕṟam̐ga nenu
noḍi nī yānalagu vīnulu mūsīm̐ dānu
(||eḍi||)
yedalam̐pu dĕlisĕno yĕchchuguṁdu galigĕno
nādo nīvu mām̐ṭāḍam̐ga navvī nābĕ
kādarāna nīvu nāgu kaḍugiṁdubaḍi yiṭṭĕ
sedulu shām̐sam̐gānu sigguvaḍīm̐ dānu
(||eḍi||)
yegaḍa dĕchchidivo yĕṁdari bhramayiṁtuvo
nāgu viḍĕmiyyam̐gānu navvī nābĕ
jogagu nāsiṁgārālu sūsi sūsi sārĕgu
dāgŏni nīvu mĕchcham̐ga talavūm̐sīm̐ dānu
(||eḍi||)
yebuna viṁtagumuṁde yĕvvadĕm̐ bĕṁḍlāḍidivo
nābai sesavĕṭṭam̐ga navvī nābĕ
rābuga śhrīveṁkaḍeśha radi nannum̐ gūḍidivi
sābalāna niṁtalone saṁtasiṁchīm̐ dānu