Emti vivegamu yeravula sitta mide

ఏఁటి వివేకము యెరవుల చిత్త మిదె
Language

(॥పల్లవి॥)
ఏఁటి వివేకము యెరవుల చిత్త మిదె
తాఁటలు దూఁటలలోనె తగిలియుండుఁ గాకా

(॥ఏఁటి॥)
తను నెఱిఁగి రక్షింప దైవమే నేరుచుఁ గాక
మనుజుఁ డే మెఱుఁగు వున్మత్తుడే
పెనఁగి పంచేంద్రియపు పెంపుడుఁ గుఱ్ఱ దాను
పొనుగ కందులోననే పొరలాడుఁ గాకా

(॥ఏఁటి॥)
కాల మెఱిఁగి పోఁ పొందను కర్మమె నేరుచుఁ గాక
కూళజీవుఁ డేమెఱుఁగు గుణబద్ధుఁడు
ఆలరి కామాదులకు నరిఁగాపై వుండుఁ దాను
పాలుమాలి వానికి పనిసేయఁ గాకా

(॥ఏఁటి॥)
కొలఁ దెఱిఁగి బోధించ గురుఁడే యెఱుఁగుఁ గాక
యిల దేహి యేమెఱుఁగు హీనశక్తుఁడు
బలిమి శ్రీ వేంకటేశు పరతంత్రుఁడు దాను
చలపట్టి యాతనికి శరణనుఁ గాక

(||pallavi||)
em̐ṭi vivegamu yĕravula sitta midĕ
tām̐ṭalu dūm̐ṭalalonĕ tagiliyuṁḍum̐ gāgā

(||em̐ṭi||)
tanu nĕṟim̐gi rakṣhiṁpa daivame nerusum̐ gāga
manujum̐ ḍe mĕṟum̐gu vunmattuḍe
pĕnam̐gi paṁcheṁdriyabu pĕṁpuḍum̐ guṭra dānu
pŏnuga kaṁdulonane pŏralāḍum̐ gāgā

(||em̐ṭi||)
kāla mĕṟim̐gi pom̐ pŏṁdanu karmamĕ nerusum̐ gāga
kūḽajīvum̐ ḍemĕṟum̐gu guṇabaddhum̐ḍu
ālari kāmādulagu narim̐gābai vuṁḍum̐ dānu
pālumāli vānigi paniseyam̐ gāgā

(||em̐ṭi||)
kŏlam̐ dĕṟim̐gi bodhiṁcha gurum̐ḍe yĕṟum̐gum̐ gāga
yila dehi yemĕṟum̐gu hīnaśhaktum̐ḍu
balimi śhrī veṁkaḍeśhu paradaṁtrum̐ḍu dānu
salabaṭṭi yādanigi śharaṇanum̐ gāga