Emti visaaramu yekkadi yaasaaramu

ఏఁటి విచారము యెక్కడి యాచారము
Language

(॥పల్లవి॥)
ఏఁటి విచారము యెక్కడి యాచారము
మాటున జీవుఁ డింతేసి మాయలఁ బొరలును

(॥ఏఁటి॥)
పరగ నూరేండ్ల బ్రతుకునకేకా
ధర నన్నియునుఁ గూర్చి దాఁచుకొనేది
పొరసి నానాసుఖభోగాలు చింతించుఁ గాని
పరమున కీపాటి ప్రయాసపడఁడు

(॥ఏఁటి॥)
కడుపు నించుకొరకుఁ గామసుఖమునకేకా
చెడని వుద్యోగాలు సేయఁ గోరును
మిడిసి లోకములెల్ల మెప్పించ నడచుఁ గాని
చిడుముడి హరి మెప్పించే ననలేఁడు

(॥ఏఁటి॥)
సారెసారెఁ జచ్చిచచ్చి జననము నొందేదెల్లా
వూరఁగల కర్మము లొగిఁ జేయుట
మేరలేక నరులను మెచ్చుగఁ గొలుచుఁ గాని
కూరిమి శ్రీవేంకటేశుఁ గొలువఁగ లేఁడు

(||pallavi||)
em̐ṭi visāramu yĕkkaḍi yāsāramu
māḍuna jīvum̐ ḍiṁtesi māyalam̐ bŏralunu

(||em̐ṭi||)
paraga nūreṁḍla bradugunagegā
dhara nanniyunum̐ gūrsi dām̐sugŏnedi
pŏrasi nānāsukhabhogālu siṁtiṁchum̐ gāni
paramuna kībāḍi prayāsabaḍam̐ḍu

(||em̐ṭi||)
kaḍubu niṁchugŏragum̐ gāmasukhamunagegā
sĕḍani vudyogālu seyam̐ gorunu
miḍisi logamulĕlla mĕppiṁcha naḍasum̐ gāni
siḍumuḍi hari mĕppiṁche nanalem̐ḍu

(||em̐ṭi||)
sārĕsārĕm̐ jachchisachchi jananamu nŏṁdedĕllā
vūram̐gala karmamu lŏgim̐ jeyuḍa
meralega narulanu mĕchchugam̐ gŏlusum̐ gāni
kūrimi śhrīveṁkaḍeśhum̐ gŏluvam̐ga lem̐ḍu