ఏఁటి చక్కఁదనము యేమి బాఁతి నేము
(॥పల్లవి॥)
ఏఁటి చక్కఁదనము యేమి బాఁతి నేము
చాటువ జవ్వనమున సడిఁబడ్డ వారము
(॥॥)
పుక్కట చకోరములఁ బోలేటి మాకన్నులు
జక్కవ పిట్టిలవంటి చన్నులు మావి
పిక్కటిల్లు చందమామబిల్ల వంటి మొగము
ముక్కు నువ్వుఁబువ్వుఁ బోలే మురిపెపువారము
(॥॥)
గుంపుఁ దుమ్మిదరెక్కల కొలము మాకురులు
సొంపు దొండపండువంటి చొక్కపుమోవి
సంపద లేఁత చిగురుజాతి మాపాదములు
ఇంపులఁ దీగెలవంటి వివివో మాచేతులు
(॥॥)
సరిలేని సింహపు చందము మానడుము
పరగ చక్రమువంటి బటువు మాపిరుఁదు
గరిమ శ్రీవేంకటేశ కలిసితి మమ్మునిట్టే
పురిగొను బంగారుబొమ్మవంటి మేను
(||pallavi||)
em̐ṭi sakkam̐danamu yemi bām̐ti nemu
sāḍuva javvanamuna saḍim̐baḍḍa vāramu
(||||)
pukkaḍa sagoramulam̐ boleḍi māgannulu
jakkava piṭṭilavaṁṭi sannulu māvi
pikkaḍillu saṁdamāmabilla vaṁṭi mŏgamu
mukku nuvvum̐buvvum̐ bole muribĕbuvāramu
(||||)
guṁpum̐ dummidarĕkkala kŏlamu māgurulu
sŏṁpu dŏṁḍabaṁḍuvaṁṭi sŏkkabumovi
saṁpada lem̐ta sigurujādi mābādamulu
iṁpulam̐ dīgĕlavaṁṭi vivivo māsedulu
(||||)
sarileni siṁhabu saṁdamu mānaḍumu
paraga sakramuvaṁṭi baḍuvu mābirum̐du
garima śhrīveṁkaḍeśha kalisidi mammuniṭṭe
purigŏnu baṁgārubŏmmavaṁṭi menu