Emti madagamulo yeebegu naadanigi

ఏఁటి మతకములో యీపెకు నాతనికి
Language

(॥పల్లవి॥)
ఏఁటి మతకములో యీపెకు నాతనికి
నాఁటకము లివి గొన్ని నడచీఁ జూడరే

(॥॥)
కొలువునేసేఁయాటది గుట్టుతోడ నుండుఁగాక
కలకల నగనేలే కాఁతాళానను
చెలఁగి విభుఁడు లోలో సేఁత లేమినేసెనో
తలఁపునఁ బుట్టుకొని తమకించీఁదాను

(॥॥)
విందుచెప్పవచ్చినాపె వినయాలు సేసుగాక
పందేలాడఁ దనకేలే పలుమారును
కందువ నాతనివల్ల కపటాలేమిగనెనో
మందలించవలసిట్టె మాట దీసీఁ దాను

(॥॥)
పీఁటపై పెండ్లికూఁతురు ప్రియముతోఁగూడుఁగాక
నీటున జంకించనేలే నేరుపుతోడ
సూటి శ్రీవేంకటేశుఁడు చూ చెలమేల్మంగను
కూటములు నేర్చుకొని గురినేసీఁ దాను

(||pallavi||)
em̐ṭi madagamulo yībĕgu nādanigi
nām̐ṭagamu livi gŏnni naḍasīm̐ jūḍare

(||||)
kŏluvunesem̐yāḍadi guṭṭudoḍa nuṁḍum̐gāga
kalagala naganele kām̐tāḽānanu
sĕlam̐gi vibhum̐ḍu lolo sem̐ta leminesĕno
talam̐punam̐ buṭṭugŏni tamagiṁchīm̐dānu

(||||)
viṁdusĕppavachchinābĕ vinayālu sesugāga
paṁdelāḍam̐ danagele palumārunu
kaṁduva nādanivalla kabaḍālemiganĕno
maṁdaliṁchavalasiṭṭĕ māḍa dīsīm̐ dānu

(||||)
pīm̐ṭabai pĕṁḍligūm̐turu priyamudom̐gūḍum̐gāga
nīḍuna jaṁkiṁchanele nerubudoḍa
sūḍi śhrīveṁkaḍeśhum̐ḍu sū sĕlamelmaṁganu
kūḍamulu nersugŏni gurinesīm̐ dānu