Emti maamtalaadeve yemdaamkaa neevu vori

ఏఁటి మాఁటలాడేవే యెందాఁకా నీవు వోరి
Language

(॥పల్లవి॥)
ఏఁటి మాఁటలాడేవే యెందాఁకా నీవు వోరి
వాఁటముగ యిట్టే వట్టి వళకులాడకురా

(॥ఏఁటి॥)
పయ్యదలో వాలెనవే పట్టియ్యవే జక్కవల
కొయ్యకాఁడ కావుర కుచములివి
ముయ్యనేఁటికే అట్లైతే మొరఁగక చూపఁగదే
యియ్యెడఁ బైఁడి బిందెలెట్లు చూపవచ్చురా

(॥ఏఁటి॥)
వొడిలోన దాఁగెనదే వొప్పగించవే సింహము
గడుసుకాఁడ కాదది నడుమింతేరా
విడిచి సోదనీవే విచ్చనవిడినట్టైతే
సుడిసి ఆకసమెట్లు సోదనగొనేవురా

(॥ఏఁటి॥)
కుచ్చలలోపల దాఁగె కొమ్మ నెమళ్ళ నీవే
అచ్చపు నడపులింతే అవిగావురా
కుచ్చి శ్రీ వేంకటేశుఁడ గురితేది అట్టైతే
యిచ్చఁగూడితివి గురుతెటు చూపవచ్చురా

(||pallavi||)
em̐ṭi mām̐ṭalāḍeve yĕṁdām̐kā nīvu vori
vām̐ṭamuga yiṭṭe vaṭṭi vaḽagulāḍagurā

(||em̐ṭi||)
payyadalo vālĕnave paṭṭiyyave jakkavala
kŏyyagām̐ḍa kāvura kusamulivi
muyyanem̐ṭige aṭlaide mŏram̐gaga sūbam̐gade
yiyyĕḍam̐ baim̐ḍi biṁdĕlĕṭlu sūbavachchurā

(||em̐ṭi||)
vŏḍilona dām̐gĕnade vŏppagiṁchave siṁhamu
gaḍusugām̐ḍa kādadi naḍumiṁterā
viḍisi sodanīve vichchanaviḍinaṭṭaide
suḍisi āgasamĕṭlu sodanagŏnevurā

(||em̐ṭi||)
kuchchalalobala dām̐gĕ kŏmma nĕmaḽḽa nīve
achchabu naḍabuliṁte avigāvurā
kuchchi śhrī veṁkaḍeśhum̐ḍa guridedi aṭṭaide
yichcham̐gūḍidivi gurudĕḍu sūbavachchurā