ఏఁటి మాటలాడేవు యేల దూరేవు
(॥పల్లవి॥)
ఏఁటి మాటలాడేవు యేల దూరేవు
నీటులు మెరసెనా నేఁడు మాచెలి
(॥ఏంటి॥)
ననుపుగలుగుచోట నవ్వెనింతేకాని నిన్ను
వనిత కెగసక్కెమా వడి నీతోను
పెనఁగులాటవేళ కొనగో రంటించెఁగాక
నినుఁ బగసాదించెనా నేఁడు మాచెలి
(॥ఏఁటి॥)
పట్టి మేనవానిచోట బలువు మెరసెఁగాక
రట్టుసేసునా రామ ఇట్టె నిన్నింత
చుట్టమవంటా నిన్ను సొలసె నింతేకాక
తిట్టులు నిన్నుఁ దిట్టునా తెగి మాచెలి
(॥ఏఁటి॥)
కూటమిగలుగుచోట గురుతులు నించెఁగాక
యీటునఁ బచ్చిసేసునా యింతి నిన్నును
గాఁటాన శ్రీవేంకటేశ కాఁగిలించెఁగాక యీపె
నాఁటిమాఁట కింతసేసునా మాచెలి
(||pallavi||)
em̐ṭi māḍalāḍevu yela dūrevu
nīḍulu mĕrasĕnā nem̐ḍu māsĕli
(||eṁṭi||)
nanubugalugusoḍa navvĕniṁtegāni ninnu
vanida kĕgasakkĕmā vaḍi nīdonu
pĕnam̐gulāḍaveḽa kŏnago raṁṭiṁchĕm̐gāga
ninum̐ bagasādiṁchĕnā nem̐ḍu māsĕli
(||em̐ṭi||)
paṭṭi menavānisoḍa baluvu mĕrasĕm̐gāga
raṭṭusesunā rāma iṭṭĕ ninniṁta
suṭṭamavaṁṭā ninnu sŏlasĕ niṁtegāga
tiṭṭulu ninnum̐ diṭṭunā tĕgi māsĕli
(||em̐ṭi||)
kūḍamigalugusoḍa gurudulu niṁchĕm̐gāga
yīḍunam̐ bachchisesunā yiṁti ninnunu
gām̐ṭāna śhrīveṁkaḍeśha kām̐giliṁchĕm̐gāga yībĕ
nām̐ṭimām̐ṭa kiṁtasesunā māsĕli