ఏఁటి కొడఁబరపించే వింత నీ బోంట్లచే
(॥పల్లవి॥)
ఏఁటి కొడఁబరపించే వింత నీ బోంట్లచే
సాటించితే నాఁటదాని పంత మేమున్నది
(॥ఏఁటి॥)
చూపులకు లోనైతేసురతపుటాస వుట్టు
చేపట్లకు వచ్చితే సిగ్గులు వుట్టు
దాపుగా వద్దనుండితేతలపోఁతలోనఁజిక్కు
పైపైనే అఁటదానిపంత మేమున్నది
(॥ఏఁటి॥)
మాటలకు లోనైతే మర్మములు గరఁగును
కూటువకతలకే గుఱుతులంటు
యీటుకు వచ్చితేనే యీరవౌను పనులెల్లా
పాటించితే నాఁటదానిపంత మేమున్నది
(॥ఏఁటి॥)
నగవుకు లోనైతే నంట్లుమిక్కుటమౌను
మొగమోట గలిగితేముచ్చట దీరు
జిగిఁ గూడె నిన్ను నీకె శ్రీవేంకటేశ్వర
పగటున నాఁటదాని పంత మేమున్నది
(||pallavi||)
em̐ṭi kŏḍam̐barabiṁche viṁta nī boṁṭlase
sāḍiṁchide nām̐ṭadāni paṁta memunnadi
(||em̐ṭi||)
sūbulagu lonaidesuradabuḍāsa vuṭṭu
sebaṭlagu vachchide siggulu vuṭṭu
dābugā vaddanuṁḍidedalabom̐talonam̐jikku
paibaine am̐ṭadānibaṁta memunnadi
(||em̐ṭi||)
māḍalagu lonaide marmamulu garam̐gunu
kūḍuvagadalage guṟudulaṁṭu
yīḍugu vachchidene yīravaunu panulĕllā
pāḍiṁchide nām̐ṭadānibaṁta memunnadi
(||em̐ṭi||)
nagavugu lonaide naṁṭlumikkuḍamaunu
mŏgamoḍa galigidemuchchaḍa dīru
jigim̐ gūḍĕ ninnu nīgĕ śhrīveṁkaḍeśhvara
pagaḍuna nām̐ṭadāni paṁta memunnadi