Emti janma mettidi ne nide neegu vega taidi

ఏఁటి జన్మ మెత్తితి నే నిదె నీకు వెగ టైతి
Language

(॥పల్లవి॥)
ఏఁటి జన్మ మెత్తితి నే నిదె నీకు వెగ టైతి
గాఁటపు నీకు గుంటెనకత్తె నైన మేలూ

(॥ఏటి॥)
చూచిన నీ చూపు లివి చుఱుకున నాఁటీ నన్ను
చేచేత నీ కేమి పగ చేసితి నేను
యీ చాయ నాకే వెఱచే వెవ్వతె నాతో నవ్వినా
కాచి గండెదిగు లైతిఁగా నీకు నేను

(॥ఏటి॥)
ఆడిన నీ మాఁట లెల్ల అట్ట లదరించీ నన్ను
కోడెకాఁడ నీకు నెంత కొల యైతినో
వోడక యిందరిచేతా నొడఁబఱపించేవు
యీడ నీకు మోచి దింపై యింతేసి ఱ ట్టైతిఁ గా

(॥ఏటి॥)
నడుమ నీ వలపులు నాకుఁ గాళ్లఁ బెనఁగీని
కడు నీకు నెన్నాళ్ల సంగర మైతినో
యెడయక శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
బడి బడిఁ గాచుకుండఁ బా లైతిఁగా

(||pallavi||)
em̐ṭi janma mĕttidi ne nidĕ nīgu vĕga ṭaidi
gām̐ṭabu nīgu guṁṭĕnagattĕ naina melū

(||eḍi||)
sūsina nī sūbu livi suṟuguna nām̐ṭī nannu
seseda nī kemi paga sesidi nenu
yī sāya nāge vĕṟase vĕvvadĕ nādo navvinā
kāsi gaṁḍĕdigu laidim̐gā nīgu nenu

(||eḍi||)
āḍina nī mām̐ṭa lĕlla aṭṭa ladariṁchī nannu
koḍĕgām̐ḍa nīgu nĕṁta kŏla yaidino
voḍaga yiṁdarisedā nŏḍam̐baṟabiṁchevu
yīḍa nīgu mosi diṁpai yiṁtesi ṟa ṭṭaidim̐ gā

(||eḍi||)
naḍuma nī valabulu nāgum̐ gāḽlam̐ bĕnam̐gīni
kaḍu nīgu nĕnnāḽla saṁgara maidino
yĕḍayaga śhrīvĕṁkaḍeśha nannum̐ gūḍidivi
baḍi baḍim̐ gāsuguṁḍam̐ bā laidim̐gā